Telangana: తెలంగాణకు వ‌చ్చి, రాష్ట్రాన్ని చూసి నేర్చుకోండి: మోదీకి కేటీఆర్ లేఖ‌

వినూత్న పథకాలు, నూతన పరిపాలన విధానాలపై మాట్లాడే స్థాయికి బీజేపీ ఎన్నడూ చేరుకోలేని కేటీఆర్ అన్నారు. ఆ పార్టీ నిర్వహిస్తున్న సమావేశాల నిజమైన అజెండా విద్వేషమ‌ని, అసలు సిద్ధాంతం విభజనే అని అందరికి తెలుసని అన్నారు. అబద్ధాల‌ పునాదులపై పాలన సాగిస్తున్న మోదీకి ఆత్మవిమర్శ చేసుకునే ధైర్యం ఉందని తాము అనుకోవడం లేదని చెప్పారు.

Telangana: తెలంగాణకు వ‌చ్చి, రాష్ట్రాన్ని చూసి నేర్చుకోండి: మోదీకి కేటీఆర్ లేఖ‌
ad

Telangana: ”ప్రధాని మోదీ గారు… తెలంగాణకు వ‌చ్చి, రాష్ట్రాన్ని చూసి పాఠాలు నేర్చుకోండి” అంటూ ప్రధాన మంత్రి మోదీకి తెలంగాణ‌ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన‌డానికి మోదీ హైద‌రాబాద్ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే మోదీకి కేటీఆర్ లేఖ రాశారు. ఈ సమావేశాల్లో విద్వేష విభజన అజెండా కాకుండా అభివృద్ధి-వికాసం గురించి మాట్లాడాల‌ని సూచించారు. బీజేపీ డీఎన్ఏలోనే విద్వేషం, సంకుచిత్వాన్ని నింపుకున్న వారు ప్రజలకు పనికొచ్చే విషయాలను ఈ సమావేశాల్లో చర్చిస్తారని అనుకోవడం అత్యాశే అని తెలుసని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

Prophet row: దేశంలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌కు కార‌ణం నుపూర్ శ‌ర్మ కాదు: రాహుల్‌

వినూత్న పథకాలు, నూతన పరిపాలన విధానాలపై మాట్లాడే స్థాయికి బీజేపీ ఎన్నడూ చేరుకోలేదని అన్నారు. ఆ పార్టీ నిర్వహిస్తున్న సమావేశాల నిజమైన అజెండా విద్వేషమ‌ని, అసలు సిద్ధాంతం విభజనే అని అందరికి తెలుసని అన్నారు. అబద్ధాల‌ పునాదులపై పాలన సాగిస్తున్న మోదీకి ఆత్మవిమర్శ చేసుకునే ధైర్యం ఉందని తాము అనుకోవడం లేదని చెప్పారు. అభివృద్ధి కోసం కృషి చేయాల‌ని బీజేపీ తెలుసుకోవ‌డానికి తెలంగాణను మించిన ప్రదేశం ఇంకొకటి లేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

Maharashtra: ఇదే ప‌ని రెండున్న‌రేళ్ళ క్రితం బీజేపీ ఎందుకు చేయ‌లేదు?: ఉద్ధ‌వ్ ఠాక్రే

తెలంగాణ ప్రాజెక్టులు-పథకాలు-సుపరిపాలన విధానాలు ప్రాధాన్యాల‌ను అధ్యయనం చేయాల‌ని ఆయ‌న మోదీకి చెప్పారు. డబుల్ ఇంజన్ ప్ర‌భుత్వంతో ప్రజలకు ట్రబుల్‌గా విధానాల‌తో స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మంచి ప‌థ‌కాల‌ను అమలు చేసేందుకు ప్రయత్నించాల‌ని ఆయ‌న అన్నారు. అద్భుతమైన తెలంగాణ గడ్డ నుంచి నూతన అలోచనా విధానానికి నాంది పలకాల‌ని సూచించారు. మత సామరస్యంతో కూడిన వసుదైక కుటుంబం లాంటి సమాజ నిర్మాణానికి ఆలోచన చేయాల‌ని కేటీఆర్ పేర్కొన్నారు.