KV Anudeep : అరుదైన వ్యాధితో బాధపడుతున్న జాతిరత్నాలు డైరెక్టర్.. కాఫీ, జ్యుస్‌లు పడవంట.. ఆ వ్యాధిపై కూడా సినిమా తీస్తాడట..

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలని తెలియచేసాడు అనుదీప్. ఈ ఇంటర్వ్యూలోనే తనకి ఓ అరుదైన వ్యాధి ఉందని చెప్పాడు............

KV Anudeep : అరుదైన వ్యాధితో బాధపడుతున్న జాతిరత్నాలు డైరెక్టర్.. కాఫీ, జ్యుస్‌లు పడవంట.. ఆ వ్యాధిపై కూడా సినిమా తీస్తాడట..

KV Anudeep has a rare disorder

KV Anudeep :  జాతిరత్నాలు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు డైరెక్టర్ అనుదీప్. సినిమా కంటే కూడా బయట అతను మాట్లాడే విధానం, అతను వేసే పంచులు, అతని సెన్సాఫ్ హ్యూమర్ కి అభిమానులు ఎక్కువయ్యారు. హీరోలకే కాదు డైరెక్టర్స్ కి ఫ్యాన్స్ ఉంటారని తెలిసిందే. ఆ లిస్ట్ లో అనుదీప్ కూడా జాతిరత్నాలు సినిమాతో చేరిపోయాడు. మొదటి సినిమా పిట్టగోడతో ఎవరికీ తెలియకపోయినా జాతిరత్నాలు సినిమాతో అందరికి అనుదీప్ గురించి తెలిసింది.

ఇటీవల శివకార్తికేయన్ తో ప్రిన్స్ సినిమా తీసి ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమా కూడా ఓ మోస్తరు విజయం సాధించింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలని తెలియచేసాడు అనుదీప్. ఈ ఇంటర్వ్యూలోనే తనకి ఓ అరుదైన వ్యాధి ఉందని చెప్పాడు.

అనుదీప్ మాట్లాడుతూ.. నాకు హైలీ సెన్సీటీవ్‌ పర్సన్‌ (హెచ్‌ఎస్‌పీ) అనే డిజార్డర్‌ ఉంది. అందుకే నా ఫేస్ ఎక్కువగా సీరియస్ గా కనిపిస్తుంది. ఇది కామన్ గా చాలా మందిలో ఉంటుంది కానీ బయటపడదు. నాకు ఎక్కువగా ఉంది. దీనివల్ల నేను కాఫీ తాగితే రెండు రోజులు నిద్ర పట్టదు. గ్లూటెన్ పడదు, జ్యుస్ లు తాగలేను, జ్యుస్ లు తాగితే నా మైండ్ పనిచేయడం ఆగిపోతుంది. ఏం చేస్తున్నానో అర్ధం కాదు. ఈ వ్యాధి వల్ల తొందరగా అలిసిపోతారు. ఘాటైన వాసనలు, ఎక్కువ లైటింగ్స్ నేను తట్టుకోలేను అని చెప్పారు.

BiggBoss 6 Day 60 : నిన్న కర్రలతో.. ఇప్పుడు ఏకంగా డైరెక్ట్ గా కొట్టుకోవడమే.. మళ్ళీ సూర్యపై ప్రేమని చూపిస్తున్న ఇనయా..

”అయితే ఈ వ్యాధి ఉన్నవారిలో కొన్ని సెన్సెస్ బాగా పనిచేస్తాయి. అలా నాకు హ్యూమర్ బాగా పనిచేస్తుంది, అందుకే ఈ పంచులు, కామెడీ. దీనిపై పరిశోధనలు చేస్తున్నారు. ఈ వ్యాధి ఉన్నవారు ఎలాంటి ఆహరం తీసుకోవాలి అని రీసెర్చ్ చేసి అదే ఆహారం తీసుకుంటున్నాను. భవిష్యత్తులో ఈ వ్యాధిపై కూడా సినిమా తీస్తాను” అని తెలిపాడు అనుదీప్. దీంతో అనుదీప్ చేసిన వ్యాఖ్యాలు వైరల్ గా మారాయి.