Kylie Jenner photoshoot :‘రక్తం’లో తడిసి ముద్దైనట్లుగా నటి ఫోటోషూట్..తిట్టిపోస్తున్న అభిమానులు

నగ్నంగా ‘రక్తం’లో తడిసి ముద్దైనట్టుగా ఓ నటి, మోడల్ చేసిన ఫోటో షూట్ చూసిన అభిమానులు తిట్టిపోతున్నారు.పౌగా గర్భంతో ఉండి ఇవేం పనులు ఇటువంటివి అవసరమా?అని విమర్శిస్తున్నారు.

Kylie Jenner photoshoot :‘రక్తం’లో తడిసి ముద్దైనట్లుగా నటి ఫోటోషూట్..తిట్టిపోస్తున్న అభిమానులు

Kylie Jenner Poses

Kylie Jenner photo shoot : కైలీ జెన్సర్. అమెరికన్ రియాలిటీ టీవీ నటి, మోడల్, మహిళా వ్యాపారవేత్త కూడా. ఆమెకు ఎంతోమంది అభిమానులున్నారు. ఇప్పుడు ఆమె చేసిన పని ఆమెను దుమ్మెత్తిపోస్తున్నారు. అభిమానులు అంటే తాము అభిమానించే సెలబ్రిటీలు మంచిపనిచేస్తే ఆకాశానికి ఎత్తేస్తారు. వారు తప్పు చేస్తే వేలెత్తి చూపుతారు.అలా చేయవద్దని సూచిస్తారు. మంచిగా ఉండాలని కోరతారు. అలా గతంలో కైలీ జెన్నర్ ను అభిమానించిన అభిమానులు ఆమె చేసిన పనికి తిట్టిపోస్తున్నారు.ఇంతకీ ఆమె ఏం చేసింది?ఎందుకు అంతలా తిడుతున్నారంటే..?

Read more : Cheetah Attack On Model : పులుల బోనులో మోడల్ ఫొటోషూట్..చీరి పడేసిన చిరుతలు

24 ఏళ్ల కైలీ జెన్నర్ ఓ మోడల్. ఆమె ఓ మేకప్ కలెక్షన్ కోసం ఇచ్చిన ఫోజులు భీతికొలిపేలా ఉన్నాయి. త్వరలో మార్కెట్లోకి రాబోయే మేకప్ కలెక్షన్ కోసం జెన్నెర్ నగ్నంగా నటించింది. పైగా రక్తంలో తడిసి ముద్దవుతున్నట్టు ఉన్న ఆమె ఫొటోలు,వీడియోలను జెన్నర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అవి చూసిన ఆమె అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.

ఆ ఫోటోలు, వీడియోలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆ స్టిల్స్ చూసిన నెటిజన్లు ఇటువంటివి సరికాదంటూ కామెంట్ చేస్తున్నారు. పైగా గర్భంతో ఉండీ..ఇలా చేయటం ఏమీ బాగాలేదని అంటున్నారు. కాస్త ఘాటుగా తిట్టిపోస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కైలీకి 275 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.వారంతా ఆమెను దుమ్మెత్తిపోస్తున్నారు.కాగా కైలీ జెన్నర్ ను మోడమ్ మొగల్ అని అంటారు. ఆమె రెండ బిడ్డను కనబోతోంది.గర్భంతో ఉండే ఇటువంటి భయానక ఫోటో షూట్ చేయటం ఏమంతమంచిది కాదని సూచిస్తున్నారు ఆమెఅభిమానులు.

Read more : Cheetah Attack On Model : పులుల బోనులో మోడల్ ఫొటోషూట్..చీరి పడేసిన చిరుతలు