Laahe Laahe song : ‘లాహే లాహే’.. మణిశర్మ మ్యూజిక్‌కి మెగాస్టార్ మెస్మరైజింగ్ మూమెంట్స్..

‘ఖైదీ నెం:150’ లో తన మెస్మరైజింగ్ డ్యాన్స్ మూమెంట్స్‌తో ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ పెట్టిన మెగాస్టార్ చిరంజీవి, తర్వాతి సినిమా ‘సైరా’ హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌కి చెందింది కావడంతో స్టెప్పులెయ్యడానికి వీలు పడలేదు. ఆ బాకీ ఇప్పుడు వడ్డీతో సహా కలిపి ఇచ్చెయ్యబోతున్నారు.

Laahe Laahe song : ‘లాహే లాహే’.. మణిశర్మ మ్యూజిక్‌కి మెగాస్టార్ మెస్మరైజింగ్ మూమెంట్స్..

Laahe Laahe Song

Laahe Laahe song: ‘ఖైదీ నెం:150’ లో తన మెస్మరైజింగ్ డ్యాన్స్ మూమెంట్స్‌తో ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ పెట్టిన మెగాస్టార్ చిరంజీవి, తర్వాతి సినిమా ‘సైరా’ హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌కి చెందింది కావడంతో స్టెప్పులెయ్యడానికి వీలు పడలేదు. ఆ బాకీ ఇప్పుడు వడ్డీతో సహా కలిపి ఇచ్చెయ్యబోతున్నారు.

Ram Charan

‘ఖైదీ నెం:150’, ‘సైరా’ తర్వాత సొంత ప్రొడక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘ఆచార్య’.. శ్రీమతి సురేఖ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.బుధవారం సాయంత్రం ఈ సినిమాలోని ‘లాహే లాహే’ అనే ఫస్ట్ లిరికల్ సాంగ్ లిరికల్ రిలీజ్ చేశారు.

Acharya

మెలోడి బ్రహ్మ మణిశర్మ ట్యూన్‌కి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాయగా హారికా నారయణ్, సాహితి చాగంటి గొంతు కలిపారు. సీనియర్ హీరోయిన్ సంగీతతో కలిసి కాజల్ అగర్వాల్ ఈ పాటలో బ్యూటిఫుల్‌గా పర్ఫార్మ్ చేశారు. ఇక మెగాస్టార్ స్టెప్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనేముంది.. కనిపించింది కాసేపే అయినా ఎప్పటిలానే అదరగొట్టేశారు. తిరు విజువల్స్ పాటకు మరింత బ్యూటీ తీసుకొచ్చాయి. ధర్మస్థలి టెంపులో నేపథ్యంలో సాగే ఈ పాటను రిచ్‌గా తెరకెక్కించారు. ‘ఆచార్య’ వేసవి కానుకగా మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.