తీవ్ర విషాదం.. తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. కన్నకొడుకు, సోదరి బలయ్యారు

తీవ్ర విషాదం.. తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. కన్నకొడుకు, సోదరి బలయ్యారు

lady accidentally kills son and sister: కేరళలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళ చేసిన పని ఇద్దరు అమాయకుల ప్రాణాలు తీసింది. తాను ఆత్మహత్య చేసుకోవాలని ఆ మహిళ అనుకుంటే.. ఆమె కన్నకొడుకు, తోడబుట్టిన సోదరి బలయ్యారు.

ఆత్మహత్య చేసుకోవాలని భావించిన మహిళ… ఎలుకల మందును కొనుక్కుని వచ్చింది. ఐస్ క్రీమ్ లో కలిపింది. అయితే, ఆమె చేసిన పొరపాటు కన్న బిడ్డను, తోడబుట్టిన చెల్లిని చంపేయగా, ఆమె మాత్రం ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. తిరువనంతపురం సమీపంలో ఉంటున్న ఓ మహిళ, ఐస్ క్రీమ్ లో ఎలుకల మందు కలుపుకుని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.

అయితే, మొత్తం ఐస్ క్రీమ్ ను ఆమె తినలేక, అక్కడే వదిలేసింది. ఆ మిగిలిన ఐస్ క్రీమ్ కనిపించే సరికి దానిలో విషం ఉందని తెలియని ఆమె కుమారుడు, 19 ఏళ్ల చెల్లెలు దాన్ని తిన్నారు. విష ప్రభావంతో వారిద్దరూ కన్నుమూశారు. వాళ్లిద్దరూ మరణించగా.. ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్న ఆ మహిళ మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఆత్మహత్య? లేక కుట్ర దాగుందా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.