Lakhimpur Kheri : యూపీ సర్కార్‌‌పై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సీరియస్

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సీరియస్ అయ్యారు. అక్కడి ప్రభుత్వం దాఖలు చేసిన స్టేటస్ రిపోర్టుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

Lakhimpur Kheri : యూపీ సర్కార్‌‌పై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సీరియస్

Up Lakhmpur

Lakhimpur Kheri Supreme Court : ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సీరియస్ అయ్యారు. అక్కడి ప్రభుత్వం దాఖలు చేసిన స్టేటస్ రిపోర్టుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 2021, అక్టోబర్ 08వ తేదీ శుక్రవారం లఖింపూర్ ఘటనపై సుప్రీంకోర్టులో వాడివేడీ వాదనలు జరిగాయి. కేంద్ర మంత్రి కుమారుడిపై తీవ్రమైన ఆరోపణలున్నాయని వ్యాఖ్యానించింది.

Read More : Love Marriage : డాక్టర్‌గా పని చేస్తున్నకూతురు ప్రేమ పెళ్లి.. తల్లిదండ్రులు ఆత్మహత్య

ఈ సందర్భంగా పలు ప్రశ్నలు సంధించింది. అసలు ఇంతవరకు కేంద్ర మంత్రి కుమారుడిని ఎందుకు అరెస్టు చేయలేదని సూటిగా ప్రశ్నించింది. యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. సిట్ లో అందరూ స్థానికులే ఉన్నారని వ్యాఖ్యానించింది. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారా ? అని ప్రశ్నించారు చీఫ్ జస్టిస్. సమయం ఇవ్వాలని యూపీ ప్రభుత్వం తరపు న్యాయవాది హరీశ్ సాల్వే కోర్టును కోరారు. మరణించిన వారి పోస్ట్ మార్టం నివేదికలో.. ఎక్కడా బుల్లెట్ గాయాల ప్రస్తావన లేదని చెప్పారు. బుల్లెట్ గాయాలు లేవని నిందితులను అదుపులోకి తీసుకోరా.. అని కోర్టు ప్రశ్నించింది.

Read More : Skipping : వాకింగ్, జాగింగ్ కంటే స్కిప్పింగ్ వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందా!..

ఇతర కేసుల్లో ఎలా వ్యవహరిస్తామో.. ఈ కేసులోనూ అలాగే ఉండాలని సూచించింది. ఇది ధర్మాసనం అభిప్రాయమని స్పష్టం చేసింది. హత్యారోపణలు ఉన్నప్పుడు.. నిందితులను ఎలా పరిగణిస్తారు.. అని సీజేఐ ప్రశ్నించారు. దయచేసి రండి.. దయచేసి మాకు చెప్పండి.. అంటూ అడుగుతారా.. అని సీరియస్ అయ్యారు. యూపీ ప్రభుత్వ న్యాయవాది.. ఇతర ఏజెన్సీల ద్వారా ఈ కేసును దర్యాప్తు చేయించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. తదుపరి విచారణలోగా.. సరైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్టు న్యాయస్థానం వెల్లడించింది. తదుపరి విచారణను 2021, అక్టోబర్ 20కి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.

Read More : IMPS : పండుగ వేళ, ఆర్బీఐ శుభవార్త..రూ. 5లక్షల వరకు ట్రాన్స్ ఫర్

లఖిమ్‌పూర్‌ ఖేరీ జిల్లాలోని టికునియా గ్రామంలో కేంద్ర సహాయమంత్రి అజయ్ మిశ్రా, ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ మౌర్య ఆదివారం ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే వీరి పర్యటనను వ్యతిరేకిస్తూ టికునియా-బందిర్పూర్ రోడ్డుపై రైతులు నల్లజెండాలతో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి,డిప్యూటీ సీఎం ప్రయాణిస్తున్న కాన్వాయ్ రోడ్డు పక్కనే ఆందోళన చేస్తున్న రైతులపైకి దూసుకెళ్లింది. రైతులు నిరసన వ్యక్తం చేస్తుండగా.. రెండు ఎస్​యూవీ వాహనాలు వారిని ఢీకొట్టాయి. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించారు. ఒక్కో కుటుంబానికి రూ.45 లక్షల ఆర్థిక సాయం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని యూపీ ప్రభుత్వం ప్రకటించింది.

Read More : Sikh Groups : జమ్ములో సిక్కుల ఆందోళన, జోలికి వస్తే సహించమంటున్న సిక్కులు

రైతులపైకి కారు ఎక్కించిన కేంద్ర మంత్రి కుమారుడిని అదుపులోకి తీసుకోవాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. హింసాత్మక ఘటనలో ఓ పోలీసు, ముగ్గురు బీజేపీ కార్యకర్తలు చనిపోయారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్ర కుమారుడు ఆశిష్‌ మిశ్రాపై హత్య కేసు నమోదైంది. ఆయనతోపాటు 13 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. విచారణ నిమిత్తం 2021, అక్టోబర్ 08వ తేదీ శుక్రవారం ఉదయం పది గంటలకు క్రైమ్‌ బ్రాంచ్‌ కార్యాలయానికి హాజరు కావాలని నోటీసు జారీ చేసింది. కానీ ఆయన హాజరు కాలేదు. ఆయన భారత్ – నేపాల్ సరిహద్దులో ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. దీంతో అతడిని అరెస్టు చేస్తారా ? లేదా ? అనేది ఉత్కంఠ నెలకొంది.