Lata Mangeshkar : 1983 వరల్డ్ కప్ టైంలో BCCI ని కాపాడిన లతా మంగేష్కర్.. అందుకు గౌరవంతో..

 లతా మంగేష్కర్‌ కి పాటలు అంటే ఎంత ఇష్టమో క్రికెట్‌ కూడా అంతే ఇష్టం. క్రికెట్‌తో, క్రికెటర్స్ తో ఆమెకు మంచి అనుబంధం ఉంది. 1983లో భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్‌లో వన్డే వరల్డ్‌కప్‌...

Lata Mangeshkar :  1983 వరల్డ్ కప్ టైంలో BCCI ని కాపాడిన లతా మంగేష్కర్.. అందుకు గౌరవంతో..

Lata Mangeshkar

Lata Mangeshkar :   లతా మంగేష్కర్‌ కి పాటలు అంటే ఎంత ఇష్టమో క్రికెట్‌ కూడా అంతే ఇష్టం. క్రికెట్‌తో, క్రికెటర్స్ తో ఆమెకు మంచి అనుబంధం ఉంది. 1983లో భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్‌లో వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన సంగతి అందరికి తెలిసిందే. అయితే అప్పుడు బీసీసీఐ ఆర్ధిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ప్రపంచ కప్‌ జరిగిన సమయంలో క్రికెటర్లకు రోజు వారీ ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది బీసీసీఐ.

అయితే వరల్డ్ కప్ గెలుచుకొని ప్రపంచమంతటా ఇండియా పేరు మారుమ్రోగేలా చేసి వస్తున్న టీం ఇండియాకి నగదు పురస్కారం ఇవ్వడానికి కూడా బీసీసీఐ దగ్గర డబ్బులు లేవు, కానీ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి అని బీసీసీఐ బోర్డు మెంబర్స్ ఆలోచిస్తుండగా ఓ బీసీసీఐ అధికారి రాజ్‌సింగ్‌ దుంగార్పూర్‌ తన దగ్గర ఓక ఆలోచన ఉందని చెప్పారు. ఆ సమయంలో సినిమాల్లో సింగర్ గా లతా మంగేష్కర్‌ టాప్ పొజిషన్లో ఉన్నారు. క్రికెటర్స్ కూడా ఆమెకు అభిమానులే. ఆవిడ వస్తుంది అంటే జనాలు చాలా మంది వచ్చే వాళ్ళు. అయితే ఆ అధికారి లతా తన స్నేహితురాలు అని ఆమెతో ఓ ప్రోగ్రాం చేయిద్దాము అని, దానికి ఎంట్రీ టికెట్, స్పాన్సర్స్ ఇలా అన్ని రకాలుగా డబ్బులు పోగయ్యేలా చూద్దామని చెప్పి లతా మంగేష్కర్ ని తాను ఒప్పిస్తా అని తెలిపాడు.

Lata Mangeshkar : ఒడిశా బీచ్‌లో లతా సైకత శిల్పం.. శిల్పి సుదర్శన్‌ ఘన నివాళులు

ఈ కార్యక్రమం గురించి లతా మంగేష్కర్ కి తెలుపగా ఆమె వెంటనే ఓకే చెప్పి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రోగ్రాం చేశారు. ఢిల్లీ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ఆ మ్యూజిక్ ప్రోగ్రాంకి భారీస్థాయిలో జనాలు వచ్చారు. లతా మంగేష్కర్ వస్తుందని తెలిసి స్పాన్సర్స్ కూడా వచ్చారు. ఆ ప్రోగ్రాం ద్వారా సుమారు 20 లక్షలు పోగయ్యాయి. దీంతో అప్పటి భారత జట్టు మెంబర్స్ అందరికి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున బహుమతిగా ఇచ్చారు. ఆ కార్యక్రమం తర్వాత క్రికెట్ టీం తో లతా మంగేష్కర్ దిగిన ఫోటో ఇప్పటికి అలా నిలిచిపోయింది.

Lata Mangeshkar : నిర్మాతగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా లతా మంగేష్కర్

అయితే అలా బీసీసీఐ క్లిష్ట పరిస్థితుల్లో అలాంటి సహాయం చేసి తమని, తమ పరువుని కాపాడినందుకు గాను ఆమెపై గౌరవంతో బీసీసీఐ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా భారత్‌లో జరిగే ఏ అంతర్జాతీయ మ్యాచ్‌కైనా రెండు వీఐపీ సీట్లు లతా మంగేష్కర్‌ కోసం రిజర్వ్‌ చేసి ఉంచుతుంది. ఇది జరిగి చాలా సంవత్సరాలైనా, ఆమె వచ్చినా రాకపోయినా, ఇప్పటికి ఇది కొనసాగిస్తోంది బీసీసీఐ. మరి ఆమె మరణాంతరం ఇది ఆపేస్తారా లేకా అదే గౌరవంతో కొనసాగిస్తారా చూడాలి.