Movie Updates : ఏ సినిమా, ఎక్కడ, ఏం జరుగుతోంది?.. లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ రౌండప్..

మహారాష్ట్రలో కరోనా విజృంభణ కారణంగా ‘బ్రేక్ ది చైన్’ పేరుతో ఏప్రిల్ 14 సాయంత్రం నుంచి మే 1 ఉదయం వరకు కొత్త మార్గదర్శకాలతో లాక్‌డౌన్ విధించింది ప్రభుత్వం. దీనిప్రకారం సినిమా హాళ్లతో పాటూ సినిమా షూటింగ్స్ కూడా బంద్ కానున్నాయి..

Movie Updates : ఏ సినిమా, ఎక్కడ, ఏం జరుగుతోంది?.. లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ రౌండప్..

Latest Entertainment Updates

Movie Updates: ధియేటర్స్ బంద్…
మహారాష్ట్రలో కరోనా విజృంభణ కారణంగా ‘బ్రేక్ ది చైన్’ పేరుతో ఏప్రిల్ 14 సాయంత్రం నుంచి మే 1 ఉదయం వరకు కొత్త మార్గదర్శకాలతో లాక్‌డౌన్ విధించింది ప్రభుత్వం. దీనిప్రకారం సినిమా హాళ్లతో పాటూ సినిమా షూటింగ్స్ కూడా బంద్ కానున్నాయి.

సూపర్ గిఫ్ట్…
సూపర్‌స్టార్ కృష్ణ బర్త్‌డే సందర్భంగా క్రేజీ అప్‌డేట్ ఇవ్వనున్నారట మహేష్ బాబు. త్రివిక్రమ్ డైరెక్షన్లో నటించబోయే ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన మే 31న ఉంటుందని సమాచారం.

ఆచార్య కోసం…
ఆచార్య షూటింగ్ కోసం సైకిల్ మీద వెళ్లారు సోనూ సూద్. షూట్ మార్నింగ్ ఉండటంతో పనిలో పని వ్యాయమంగా పనికొస్తుందంటూ సైకిల్‌పై లోకేషన్ చేరుకున్నారు సోనూ.

రాధేశ్యామ్ రీషూట్..?
రీసెంట్‌గా రాధే శ్యామ్ రషెష్ చూసిన ప్రభాస్ కొన్ని సీన్స్ మళ్లీ చేద్దామని డైరెక్టర్‌తో చెప్పినట్టు టాక్. ఈ నెలలోనే పెండింగ్ పూర్తి చేయనున్నారని తెలుస్తోంది.

సీమ బిడ్డగా…
వకీల్ సాబ్ చిత్రంలో తెలంగాణవాసిగా ఆకట్టుకున్న పవర్‌స్టార్…అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్‌లో సీమ బిడ్డగా కనిపించబోతున్నారు. ఇందులో రాయలసీమ ప్రాంత వాసిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు పవన్.

నాకు చేతకాదు…
పవన్ కల్యాణ్‌తో సినిమా తీయడం తనకు చేతకాదన్నారు రామ్ గోపాల్ వర్మ. పవన్ ఇమేజ్, హీరోయిజం, ఫ్యాన్ ఫాలోయింగ్‌కి తగ్గట్టు కమర్షియల్ సినిమా తీయడం కుదరదన్నారు వర్మ.

క్లోజ్ చేసేశారు…
పెద్ద ఆర్భాటం లేకుండా స్టార్ట్ చేసిన దృశ్యం 2 సినిమాని పూర్తి చేసేశారు విక్టరీ వెంకటేష్. రీసెంట్‌గా జీతూ జోసెఫ్ దృశ్యం 2లో వెంకీ పాత్రకి సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తయ్యింది.

మైసూరులో…
ఎఫ్ 3 మూవీ యూనిట్ మైసూరుకు పయనమైంది. ఈ సినిమాకు సంబంధించిన తాజా షెడ్యూల్ ఏప్రిల్ 15 నుంచి మైసూర్‌లో జరగనుంది.

పుష్ప తర్వాత…
ఇంతకుముందు ప్రకటించిన కొరటాల సినిమా వాయిదాపడటంతో బన్నీ నెక్ట్స్ సినిమా ఏంటనే దానిపై చర్చ నడుస్తోంది. రీసెంట్‌గా వకీల్ సాబ్ తో హిట్ కొట్టిన వేణూ శ్రీరామ్ బన్నీ హీరోగా ఐకాన్ ప్రారంభిస్తారని అంటున్నారు.

కేజీఎఫ్ డైరెక్టర్..?
కొన్ని నెలల క్రితం కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్, అల్లు అర్జున్ మీటింగ్స్ జరిగిన సంగతి తెలిసిందే. దీంతో బన్నీ నెక్ట్స్.. ప్రశాంత్ నీల్ తో కలిసి సెట్స్ పైకెళ్లినా ఆశ్చర్యం లేదంటున్నారు.

మ్యూజిక్ అప్‌డేట్స్…
సలార్, కేజీఎఫ్ 2 సినిమాల అప్‌డేట్స్ ఇచ్చారు ప్రశాంత్ నీల్. మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ అటు సలార్ మ్యూజిక్ పనులతోపాటు ఇటు కేజీఎఫ్ 2 రీ రికార్డింగ్ పనిని కూడా పూర్తి చేస్తున్నాడని ప్రకటించాడు.

హీరోయిన్స్ ఫిక్స్..?
హీరోయిన్స్ కియారా, పూజా హెగ్డే పేర్లు మళ్లీ వైరల్ గా మారాయి. త్రివిక్రమ్ – మహేష్ ప్రాజెక్ట్‌లో పూజా ఫైనల్ అయిందనీ.. కొరటాల – ఎన్టీఆర్ సినిమాలో కియారా ఫిక్సయిందని సమాచారం.

వాయిదాల పర్వం…
రానా, సాయిపల్లవి నటించిన విరాట పర్వం వాయిదాపడింది. ఏప్రిల్ 30న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను కరోనా ఉధృతి కారణంగా పోస్ట్‌పోన్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్.

మళ్లీ ‘అపరిచితుడు’…
శంకర్, రణ్‌వీర్ సింగ్ కలయికలో అపరిచితుడు రీమేక్ రానున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. పెన్ స్టూడియోస్ ఈ పాన్ ఇండియా సినిమాను నిర్మించనుంది.

చరణ్ సంగతేంటి…?
రణ్‌వీర్ సింగ్, డైరెక్టర్ శంకర్ ప్రాజెక్ట్ 2022 మిడిల్ లో పట్టాలెక్కనుంది. ఈలోపు దిల్ రాజు నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా సినిమాను కంప్లీట్ చేయనున్నారు శంకర్.

అవి పుకార్లు…
జెర్సీ రీమేక్ తర్వాత తాను రామ్ చరణ్ తో సినిమా చేస్తానని వస్తోన్న వార్తల్లో నిజం లేదన్నారు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. ఇంకా నెక్ట్స్ సినిమాకు స్ట్రిప్ట్ కూడా సిద్ధం చేయలేదన్నారు.

స్వీట్ మెమోరీస్…
త్రోబ్యాక్ ఫోటోస్ తో ఆకట్టుకుంటున్నారు అల్లు అర్జున్. ఒకటే రెడ్ కలర్ స్కూటర్ పై పెళ్లైన తర్వాత, అయాన్ పుట్టిన తర్వాత, అర్హ పుట్టిన తర్వాత ఇలా డిఫరెంట్ వేరియేషన్స్‌లో పిక్స్ షేర్ చేశారు స్నేహా రెడ్డి.

డైరెక్టర్ వైష్ణవ్…
రీసెంట్‌గా బుచ్చిబాబు రిలీజ్ చేసిన ఉప్పెన మేకింగ్ వీడియో ఆకట్టుకుంటోంది. ఇందులో డైరెక్టర్‌గా కెమెరా ముందు కూర్చొన్న వైష్ణవ్.. స్టార్ట్, కెమెరా, యాక్షన్ అంటూ సరదాగా కొద్దిసేపు దర్శకుడిగా మారాడు.

నో కరోనా…నో బ్రేక్
తనకు కరోనా సోకి శాకుంతలంకి బ్రేక్ పడిందన్న వార్తల్లో నిజం లేదన్నారు గుణశేఖర్. అవన్నీ పుకార్లేనని శాకుంతలం షూటింగ్ జరుగుతోందని ట్వీట్ చేసారు.

ట్రెండింగ్ అఖండ…
అఖండ టైటిల్‌తో ఉగాదిరోజు రంగంలోకి దిగిన బాలయ్య ట్రెండింగ్‌లో ఉన్నారు. బోయపాటి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ మూవీ మే 28న రిలీజ్ కానుంది.

నిర్మాతగా…
ఆర్టీ వర్క్స్ బ్యానర్‌పై రవితేజ త్వరలోనే ఓ సినిమాకు ప్రొడ్యూస్ చేయనున్నారని తెలుస్తోంది. ఓ మలయాళ హీరోతో రెండు భాషల్లో ఈ మూవీ సెట్స్ పైకెళ్లనుందని టాక్.

బాక్సింగ్ రింగ్‌లో…
ప్రత్యేకంగా డిజైన్ చేసిన కస్టమైజ్డ్ సెట్స్‌లో హై ఇంటెన్సిటీ బాక్సింగ్ ఎపిసోడ్స్‌ను తెరకెక్కించే పనిలో ఉంది గని టీమ్. వరుణ్ తేజ్, నవీన్ చంద్రలపై ఈ బాక్సింగ్ సీన్స్ షూట్ చేస్తున్నట్టు టాక్.

సామ్ ఆసనం…
తన వర్కౌట్‌కి సంబంధించిన పిక్ షేర్ చేసి షాక్ ఇచ్చారు సమంతా. తల కిందకు కాళ్లు పైకి పెట్టి తాడు సాయంతో ఆసనం వేసి…లైఫ్ అనేది హోల్డ్ చేస్తూ వదిలేదనే క్యాప్షన్ ఇచ్చారు.

కామెడీ క్లాస్…
రీసెంట్‌గా ఓ ఫన్నీ వీడియోను షేర్ చేశారు సమంతా. మేము ఎంటర్‌టైనర్స్ అంతే కాని ప్యాక్ట్ చెకర్స్ కాదంటూ కామెడీ చేశారు సామ్.

ఇష్క్ స్టోరీ…
తేజా సజ్జా, ప్రియా వారియర్ జంటగా నటిస్తున్న ఇష్క్ – నాట్ ఏ లవ్ స్టోరీ మూవీ ట్రైలర్ రిలీజైంది. కాగా ఈ మూవీ ఏప్రిల్ 23న థియేటర్స్‌లోకి రాబోతుంది.

రకుల్ ఆల్బమ్…
రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోన్న మ్యూజిక్ ఆల్బమ్ దిల్ హై దివానా ఫస్ట్ లుక్ రిలీజైంది. ఇందులో ఆమె హీరో అర్జున్ కపూర్‌తో కలిసి రొమాన్స్ చేసింది.

వరలక్ష్మీ చేజింగ్…
లేడీ ఓరియెంటేడ్ మూవీ చేజింగ్ తో బిజీగా మారారు వరలక్ష్మీ శరత్ కుమార్. పోలీస్ ఆఫీసర్‌గా ఆమె కనిపించనున్న ఈ చిత్రానికి డైరెక్టర్ కెకె కుమార్.

సన్నీ షెరో…
పాన్ ఇండియా మూవీ షెరో సినిమాను అనౌన్స్ చేసింది సన్నీలియోన్. శ్రీజిత్ విజయన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ షూటింగ్ కోసం రీసెంట్‌గా సన్నీ కేరళ వెళ్లింది.

ఆరాట్టు టీజర్…
కంప్లీట్ యాకర్ట్ మోహన్ లాల్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్.. ఆరాట్టు.. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.

టాక్సీ డ్రైవర్…
తెలుగు, తమిళ్ సినిమాలతో ఫుల్ బిజీగా మారింది ఐశ్వర్యా రాజేష్. తాజాగా ఆమె డ్రైవర్ జమున అనే చిత్రంలో టాక్సీ డ్రైవర్‌గా నటిస్తోంది.