ఇది రైలా!..లగ్జరీ విమానమా!!.ఇండియన్ రైల్వే కొత్త బోగీలు..సీట్లు చూడండీ..భలే ఉన్నాయ్..

10TV Telugu News

latest indian railway coaches facilities :  భారత దేశంలో సామాన్యులు దూర ప్రయాణానికి ఎక్కువగా రైలు మార్గాలనే ఉపయోగిస్తారు. సామాన్యుల బడ్జెట్ కు ఈ రైలు ప్రయాణాలే అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వారికి అంతకంటే దిగువ తరగతివారి రైలు మార్గాలే ప్రధానంగా ఉంటాయి. మన రైల్వే వ్యవస్థ అంత అద్భుతంగా ఉండదని, ఇతర దేశాలతో పోల్చుకుంటే మన రైళ్లు, వాటి హైజీనిటీ చాలా తక్కువని విమర్శలు ఉన్నాయి.

అయితే ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే వ్యవస్థల్లో ఇండియన్ రైల్వేస్ కూడా ఒకటి అనే విషయం మరచిపోకూడదు. రైల్వేలో 13 లక్షల మందికిపైగా ఉద్యోగులు ఉన్నారు. చేస్తున్నారు. ఇంత మందికి ఉద్యోగావకాశాలు కల్పించే మరో రంగం లేదనడం అది ఏమాత్రం అతిశయోక్తి కాదనే చెప్పాలి.

కరోనా కారణంగా చాలా రైళ్ల సర్వీసులు నిలిపివేశారు. దీంతో సామాన్యులు ప్రయాణాలు చేయాలంలే పెద్ద సమస్యలే వచ్చి పడ్డాయి. మరోపక్క జేబులకు చిల్లులు పడిపోతున్నాయి కూడా. భారతదేశంలో సుమారు లక్షా పదిహేను వేల మైళ్ల పొడవున రైలు మార్గాలున్నాయి.13వేలపైగా రైళ్లు ప్రజలకు సేవలందిస్తున్నాయి.

కానీ ప్రయాణికులకు సౌకర్యం మాత్రం అంతంతమాత్రమనే చెప్పాలి.కానీ అంతకు మించి సామాన్యుడు బడ్జెట్ పెట్టలేడు కాబట్టి ఈ రైలు ప్రయాణాలమీదనే ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. వీటన్నింటికీ సమాధానం ఇవ్వడానికేనన్నట్లుగా కొత్త రైలు బోగీలను డిజైన్ చేస్తోంది ఇండియన్ రైల్వేస్. ఈ బోగీలు, వాటిలో సదుపాయాలు చూస్తే.. ఇది రైలా? లేక విమానమా? అని ఆశ్చర్యపోక తప్పదని మాత్రం చెప్పాల్సిందే. మరి దీనికి తగినట్లుగా రైల్వే చార్జీల ధరలు పెంచుతారో లేదో పక్కన పెడితే కొత్తగా డిజైన్ చేసిన రైలు బోగీలు..దాంట్లోని సీట్ల నిర్మాణం చూస్తే మాత్రం ఇది రైలే లేక లగ్జరీ విమానమా? అనిపిస్తుంది.

రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్ లో షేర్ చేసిన ఓ వీడియో వైరల్ గా మారింది. భలే ఉందే ఈ కొత్త రైలు..ఎప్పుడెప్పుడు దీంట్లో ప్రయాణం చేద్దామా? అని అనిపిస్తోంది. ఈ కొత్త రైలు బోగీల మోడల్‌ వీడియోను షేర్ చేస్తూ మంత్రి గోయల్ ‘‘ప్రయాణాన్ని జ్ఞాపకాల్లో కొలవాలికానీ, మైళ్లలో కాదు’’ అనే కొటేషన్ కూడా పెట్టారు.‘‘ఇండియన్ రైల్వేస్ తయారు చేస్తున్న కొత్త విస్తాడోమ్ బోగీలను మీరు కూడా చూడండి. వీటిలో ప్రయాణిస్తే మీరు కచ్చితంగా మర్చిపోలేని అనుభవాన్ని పొందుతారు’’ అని తెలిపారు.

ఈ విస్తాడోమ్ బోగీల్లో సీట్ల మధ్య గ్యాప్ కానీ, సీట్లు కానీ చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉన్నాయి. అంతే కాదు, సీట్ల ఫేసింగ్‌ను కూడా మనకు అనుగుణంగా మార్చుకోవచ్చు. ప్రతి బోగీలో సీసీ కెమెరాలు కూడా అమర్చారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇది రైలేనా? లేక విమానమా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. భలే ఉందే ఈ కొత్త రైలు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో..ఎప్పుడెప్పుడు ఈ రైల్లో ప్రయాణం చేసే అనుభూతిని పొందుతామో అన్నట్లుగా ఉందీ కొత్త రైలు..లోపల సీట్ల డిజైన్..