Argument between Judge and lawyer : హిందీలో ఉన్న పిటిషన్ తిరస్కరించిన జడ్జ్.. తీసుకోవాల్సిందే అన్న లాయర్.. లాయర్, జడ్జ్ ఆర్గ్యుమెంట్ వైరల్
హిందీలో పిటిషన్ ఇచ్చినందుకు తిరస్కరించారు ఓ న్యాయమూర్తి. తనకు ఇంగ్లీష్ రాదని.. ఎదురువాదనకు దిగాడు లాయర్. ఇద్దరి మధ్య జరిగిన వాదనలో లాయర్ పట్టు సాధించాడు. అందరి మనసు దోచుకున్నాడు.

Argument between Judge and lawyer
Argument between Judge and lawyer : కార్పోరేట్ సంస్థల్లో ఇంగ్లీష్ కంపల్సరీ.. ప్రభుత్వ సంస్థల్లో కూడా ఇంగ్లీష్‌కి ప్రాముఖ్యత పెరిగింది. ఇక హిందీ మాట్లాడేవాళ్లకి ఉద్యోగం అంటే కాస్త కష్టం అవుతోంది. ఇక కోర్టులో సైతం ఇంగ్లీష్‌లోనే పిటిషన్ దాఖలు చేయాలన్న న్యాయమూర్తితో ఓ న్యాయవాది వాదించిన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
కోర్టులో న్యాయవాది హిందీలో పిటిషన్ దాఖలు చేశాడు. దానికి న్యాయమూర్తి తనకు హిందీ రాదని.. ఇంగ్లీష్‌లోనే పిటిషన్ దాఖలు చేయాలని కోరారు. అందుకు లాయర్ ‘తనకు ఇంగ్లీష్ రాదు’ అని సమాధానం చెప్పాడు. అయితే ‘మీ పిటిషన్ ను రిజెక్ట్ చేస్తున్నానన్న’ న్యాయమూర్తి మాటలకు ..’హిందీకి ఫుల్ బెంచ్ మద్దతు ఉందని’ లాయర్ మళ్లీ సమాధానం ఇచ్చారు. ‘ఇక మీ కేసు ముగిసింది నెక్ట్స్ కేస్‌కి వెళ్తున్నాను’ అని న్యాయమూర్తి సమాధానం ఇవ్వగా.. ‘రూల్ విన్నతరువాత ముందుకి వెళ్లండి.. పాట్నా హైకోర్టులో న్యాయమూర్తులందరూ వింటున్నారు. అయినా మా కాపీని ఇంగ్లీష్ లోకి అనువాదం చేయాల్సిందిగా హుజూర్‌ని రిక్వెస్ట్ చేశాము.. అది అనువాదం అయ్యే లోపు డివిజన్ బెంచ్ ఆర్డర్ ని ఇస్తున్నాము’ అంటూ లాయర్ చాలా స్ట్రాంగ్ గా మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది.
వీరి ఆర్గ్యుమెంట్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షాలినీ కుమావత్ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేసారు. ‘వకీల్ సాబ్ హిందీపై మీకున్న అభిమానం మా అందరి హృదయాల్ని గెలుచుకుంది’ అంటూ శీర్షిక పెట్టారు.
Donald Trump : ట్రంప్‌పై అత్యాచారం కేసు .. కోర్టుకెక్కిన 79 ఏళ్ల మహిళ
హిందీ భాష విషయంలో న్యాయవాది ధైర్యంగా మాట్లాడిన మాటలకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘వకీల్ సాబ్ మీమీద టన్నుల కొద్దీ అభిమానం కలుగుతోందని కొందరు.. హిందీలో ఇచ్చిన పిటిషన్లను కూడా గౌరవించి అంగీకరించమని న్యాయమూర్తులను మేము అభ్యర్ధిస్తున్నామని’ మరికొందరు సమాధానం ఇచ్చారు. మొత్తానికి గట్స్ ఉన్న లాయరే.. అందరి మన్నననలు పొందుతున్నాడు.
वकील साहब का #हिंदी_प्रेम आपका दिल जीत लेगी, छा गए वकील साहब ☺️😄@DrKumarVishwas pic.twitter.com/1o6KwqlTqV
— Shalini kumawat ( हिन्द की नारी ) (@ShaliniKumawat0) April 25, 2023