బద్దకస్తుల బుర్రకు పదునెక్కువ అంటోన్న సైన్స్

బద్దకస్తుల బుర్రకు పదునెక్కువ అంటోన్న సైన్స్

Laziness: నిజాయతీగా మాట్లాడుకుంటే బద్ధకస్తులపై చాలా నెగెటివ్ టాక్‌యే ఉంటుంది. ప్రత్యేకించి ప్రపంచంలో ఉన్న బిలీయనర్లతో పోల్చి మరీ వెక్కిరిస్తుంటారు.

వర్జిన్ గ్రూప్ ఫౌండర్ రిచర్డ్ బ్రాన్సన్ ప్రతి రోజూ 5గంటలకు నిద్రలేస్తారు. ఈ మెయిల్స్ అన్నింటికీ ఆన్సర్ చేస్తారు. కుటుంబంతో కలిసి బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేస్తారు. వార్తలు చదువుతారు, మీటింగ్స్ కు అటెండ్ అవుతారు. టెన్నిస్, రన్నింగ్ లాంటి స్పోర్ట్స్ ఆడతారు. ఇదంతా.. రాత్రి 11గంటల కంటే ముందుగానే అయిపోతుంది. ఎందుకంటే అతను యాక్టివ్ గా ఉంటాడు కాబట్టి. అలాంటి వాళ్లను బద్దకస్థులు అనడం నేరమే కదా..

కానీ, బద్దకస్థులు కెరీర్ లో సక్సెస్ కాలేరా.. వారికి స్మార్ట్ థింకింగ్ ఉండదా.. అంటే అదృష్టవశాత్తు బద్దకం అనేది తెలివికి ఓ నిదర్శనం అని సైన్స్ చెబుతుంది.

సైన్స్ ఏం చెబుతుందంటే..
ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండేవారి బ్రెయిన్ కంటే.. బద్ధకంగా ఉండే వారి బ్రెయిన్ చాలా యాక్టివ్ గా పనిచేస్తుందట. జర్నల్ ఆఫ్ హెల్త్ సైకాలజీ నిర్వహించిన 2015స్టడీ ప్రకారం.. ఈ విషయం కన్ఫామ్ అయింది. బద్ధకత్వాన్ని నిర్వచించిన రీసెర్చర్లు.. ఇదొక జ్ఞానం లాంటిదని చెబుతున్నారు.

స్టడీ చేయడం కోసం రీసెర్చర్లు క్వశ్చనింగ్ సెషన్ ఒకటి ఏర్పాటు చేశారు. అందులో 60 సబ్జెక్టులను తీసుకుని రెండు గ్రూపులుగా విడదీశారు. సర్వే రెస్పాన్స్ లను బట్టి ఆలోచించే వారు, ఆలోచించని వారు అని కేటాయించారు. పార్టిసిపెంట్లు అంతా.. ఏడు రోజుల పాటు యాక్టివిటీ ట్రాకర్లు ధరించారు. దానిని బట్టి రీసెర్చర్లు వారి అలవాట్లను గమనించడానికి వీలుంటుందన్నమాట.

ఆ డేటాను బట్టి.. ఎక్కువ ఐక్యూ ఉంటే త్వరగా బోర్ కొట్టేస్తూ ఉండేది. అదే తక్కువ యాక్టివ్ గా ఉండేవారు ఎక్కువ సేపు ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కువగా యాక్టివ్ గా ఉండే గ్రూప్ కు చాలా బోరింగ్ గా అనిపించేది. అలాంటప్పుడు వారు యాక్టివ్ టాస్క్ లు చేసుకునేందుకు మైండ్ ను మార్చుకునేవారు. స్పోర్ట్స్ తో పాటు ఇతర ఫిజికల్ యాక్టివిటీస్ లాంటివి చేసుకుని ఆ లోటు పూడ్చుకునేవారు.

యాక్టివ్ నెస్ తక్కువగా ఉండే వాళ్లు మాత్రం రిలాక్స్ గా ఉండి.. అవసరమైనప్పుడు మాత్రమే రియాక్ట్ అయ్యేవారు. మిగిలిన సమయమంతా రెస్ట్ లోనే గడిపేసేవారు.