Padi Kaushik Reddy: ఆడియో లీక్.. కాంగ్రెస్‌ పార్టీకి కౌశిక్‌ రెడ్డి రాజీనామా

ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజురాబాద్‌‌లో ఉపఎన్నిక రాబోతుండగా.. తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు మొత్తం హుజూరాబాద్ చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి.

Padi Kaushik Reddy: ఆడియో లీక్.. కాంగ్రెస్‌ పార్టీకి కౌశిక్‌ రెడ్డి రాజీనామా

Kaushik

Kaushik Reddy: ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజురాబాద్‌‌లో ఉపఎన్నిక రాబోతుండగా.. తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు మొత్తం హుజూరాబాద్ చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నాయకుడు కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.

ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ పార్టీకి పాడి కౌశిక్‌ రెడ్డి రాజీనామా చేశారు. పీసీసీ షోకాజ్‌ ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు పాడి కౌశిక్‌ రెడ్డి. కాసేపట్లో తెలంగాణ పీసీసీకి తన రాజీనామా లేఖను పంపనున్నారు. ఆడియో టేపు వైరల్‌ అవ్వగా.. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌ నేతగా ఉన్న కౌశిక్ రెడ్డి, 2018 ఎన్నికల్లో హుజురాబాద్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఈటల చేతిలో ఓటమిపాలైనా.. ఒట్లు మాత్రం బాగానే వచ్చాయి. లేటెస్ట్‌గా బయటపడిన ఆడియో క్లిప్‌ వ్యవహారంతో కౌశిక్‌ రెడ్డి కారెక్కడం ఖాయమైంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి కౌశిక్ రెడ్డి రాజీనామా చేశారు.

కౌశిక్ రెడ్డి ఆడియో లీక్‌లో తనకే టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇస్తుందని ఓ యువకుడికి చెప్పారు. రాబోవు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని నేనే అంటూ కౌశిక్‌రెడ్డి ప్రచారం చేసుకున్నారు. కౌశిక్ రెడ్డి తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సన్నిహిత బంధువు.