Mao Zedong-Xi Jinping : మావో జెడాంగ్ తర్వాత అంతటి శక్తిమంతమైన నేతగా జిన్‌పింగ్..!!

మావో జెడాంగ్ తర్వాత అంతటి శక్తిమంతమైన నేతగా జిన్‌పింగ్ అవరించారంటోంది చైనా కమ్యూనిస్టు పార్టీ. చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఇటీవల ఒక తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా మావో జెడాంగ్ తర్వాత పార్టీలో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ స్థానాన్ని అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా ధృవీకరించింది చైనా కమ్యూనిస్టు పార్టీ.

Mao Zedong-Xi Jinping : మావో జెడాంగ్ తర్వాత అంతటి శక్తిమంతమైన నేతగా జిన్‌పింగ్..!!

Mao Zedong-Xi Jinping

Mao Zedong-Xi Jinping : చైనా ఇప్పుడే అమెరికాను టెన్షన్ పెడుతోందంటే.. అదే.. జిన్ పింగ్ గనక మూడోసారి చైనా ప్రెసిడెంట్‌గా ఎన్నికైతే.. ఎలా ఉంటుంది? అంతర్జాతీయ సమాజంలో.. ఇప్పుడీ పాయింట్ మీద కూడా డిబేట్ నడుస్తోంది. జిన్‌పింగ్ గనక మూడోసారి చైనా ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారంటే.. అంతర్జాతీయంగా మరింత పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తారనే చర్చ సాగుతోంది. అక్టోబర్ ఆదివారం (2022) జరగబోయే సీపీసీ కాంగ్రెస్‌లో.. జిన్‌పింగ్ తన చరిత్రను తానే రాసుకోబోతున్నారు. దీనికి చైనా కమ్యూనిస్టు పార్టీ మద్దతు పలుకుతోంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఇటీవల ఒక తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా మావో జెడాంగ్ తర్వాత పార్టీలో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ స్థానాన్ని అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా ధృవీకరించారు.

వినటానికి ఇది కాస్త అతిగా అనిపించినా.. జిన్‌పింగ్ మదిలో బలంగా నాటుకుపోయిన కోరిక మాత్రం ఇదే. మరికొన్ని గంటల్లోనే.. ఇది నెరవేరబోతోంది. చైనా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన నేత.. మావో జెడాంగ్. ఆయన తర్వాత.. చైనాలో అంతటి స్థాయి, పేరు, ప్రఖ్యాతులు.. ఏ నాయకుడికి రాలేదు. దీంతో మావో జెడాంగ్ తర్వాత అంతటి శక్తిమంతమైన నేతగా అవతరించేందుకు.. జిన్ పింగ్ అన్నీ సిద్ధం చేసుకున్నారు. మూడోసారి.. చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు అనుగుణంగా.. అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా కూడా పావులు కదుపుతోంది. ఈ మేరకు.. తీర్మానం చేసే ఆలోచనలో సీపీసీ ఉంది. ఇప్పటికే.. రెండు సార్లు చైనా అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన జిన్ పింగ్.. మూడోసారి ప్రెసిడెంట్‌గా ఎన్నికవడంతో పాటు శాశ్వతంగా చైనా అధ్యక్షుడిగా తానే ఉండేలా.. రాజ్యాంగాన్ని కూడా మార్చేసేందుకు పావులు కదుపుతున్నారు.

China-US ‘Cold War’ : అంతర్జాతీయ వాణిజ్యంలో ఎదుగుతున్న చైనా.. తొక్కిపడేయాలని చూస్తున్న అమెరికా

2012లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిన్ పింగ్ క్రమంగా తన బలాన్ని, పార్టీపై పట్టుని పెంచుకున్నారు. కమ్యూనిస్ట్ పార్టీలో, దేశంలోని కీలక అధికార పదవుల్లో.. తన వాళ్లను నియమించుకోవడం ద్వారా.. తనకు ఎదురులేకుండా చేసుకున్నారు. సమిష్టి నాయకత్వ సంప్రదాయం నుంచి చైనాను బయటకు తీసుకొచ్చేందుకు జిన్ పింగ్ ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఇప్పటిదాకా ఆ దేశంలో కొనసాగిన పాలనకు భిన్నంగా.. ఏక వ్యక్తి పాలన వైపు జిన్ పింగ్ మొగ్గు చూపారు. 2013లో ద్రోహులుగా, అవినీతిపరులుగా, అసమర్ధులుగా భావించే అధికారులను తొలగించేందుకు.. జిన్ పింగ్ పెద్ద క్యాంపెయిన్ ప్రారంభించారు. ఆ ఖాళీ స్థానాలన్నింటిని.. తన మిత్రపక్షాలతో భర్తీ చేయడం ద్వారా తన అధికారాన్ని చైనా వాల్ అంత స్ట్రాంగ్‌గా నిర్మించుకున్నారు. ఓ రిపోర్ట్ ప్రకారం.. జిన్ పింగ్ పదవీకాలంలో.. ఇప్పటివరకు 47 లక్షలకు పైగా అధికారులను విచారించారు.

చనిపోయేంత వరకు.. తానే చైనాకు అధ్యక్షుడిగా ఉండాలనుకుంటున్న జిన్‌పింగ్ కలలకు.. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఒప్పుకున్నా.. ఆ దేశ సైన్యం కొంతమేర ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంటుంది. దీనిని ముందే పసిగట్టిన జిన్‌పింగ్.. తిరుగుబాట్లను అరికట్టేందుకు 2015 నుంచి సైన్యంలో విస్తృతమైన సంస్కరణలు చేపట్టారు. తన వ్యతిరేకులను పీకి పారేశారు. తనకు నమ్మకస్తులైన వారినే.. సైన్యంలో ఉన్నత స్థానాల్లో నియమించారు. ఇక.. చైనా మీడియాను సైతం తన కంట్రోల్‌లోనే ఉంచుకున్నారు. తను చెప్పిందే వేదమనేలా చేసేందుకు.. ఎన్నో మార్పులు చేసి.. ప్రభుత్వ మీడియాను తన ఆధీనంలోకి తీసుకున్నారు. జిన్‌పింగ్ అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ మీడియా స్వతంత్రత క్రమంగా క్షీణించింది. కేవలం అధ్యక్షుడికి సంబంధించిన ప్రచారం ఊహించని స్థాయిలో పెరిగిపోయింది. దేశంలోనే తానొక అత్యున్నత వ్యక్తినని.. 2017లో ఇచ్చిన ప్రకటనలో జిన్ పింగ్ స్పష్టం చేశారు.

ఇప్పటికే.. ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన నేతగా అవతరించిన జిన్ పింగ్.. ఈ ఆదివారం జరగనున్న చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ 20వ కాంగ్రెస్‌లో.. మూడోసారి అధ్యక్షునిగా ఎన్నికవడం లాంఛనమేననే ప్రచారం సాగుతోంది. మావో జెడాంగ్ తర్వాత.. అత్యంత శక్తిమంతమైన, సమర్థవంతమైన నాయకుడిగా.. తనను తాను ప్రొజెక్ట్ చేసుకునేందుకు జిన్ పింగ్ ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు.. తనపై ఎలాంటి వ్యతిరేకత, తిరుగుబాటు తలెత్తకుండా ప్రభుత్వంలో భాగమయ్యే నాయకులను కూడా మార్చేస్తున్నారు. ఇప్పటికే.. పార్టీలో కీలకమైన వ్యక్తుల నియామకాలను నియంత్రించే విభాగానికి.. విశ్వసనీయమైన వ్యక్తులను జిన్ పింగ్ నియమించారు. అంతేకాదు.. గతేడాది జారీ చేసిన తీర్మానంతో.. సైన్యంతో పాటు ఏదైనా మిషన్‌లో రిక్రూట్‌మెంట్ విషయంలో తన భాగస్వామ్యం ఉండేలా చేశాడు. దీంతో.. సైన్యంలో జరిగే ప్రతిదీ జిన్‌పింగ్‌కి తెలిసిపోతుంది. దీని ద్వారా తన అధ్యక్ష పదవిపై.. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో పెరిగే అసంతృప్తి, అసహనాన్ని.. వెంటనే అణచివేసేందుకు అవకాశం దొరికింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

సీపీసీ 8వ కాంగ్రెస్‌లో.. కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీగా, సెంట్రల్ మిలటరీ కమిషన్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన జిన్ పింగ్.. కొన్నేళ్లలోనే పార్టీపై పట్టు బిగించారు. దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక.. ఈ పదేళ్లలో.. తన పేరుని, చైనా శక్తికి ఆల్టర్నేట్‌గా మార్చుకున్నారు. 2035 నాటికి చైనాను పూర్తిగా.. ఆధునిక సోషలిస్టు సమాజంగా మార్చేందుకు.. 2050 నాటికి ప్రపంచంలోనే సంపన్నమైన, శక్తిమంతమైన, ప్రజాస్వామ్య, సామరస్య, అందమైన, సోషలిస్ట్ ఆధునిక దేశంగా మలచడమే జిన్ పింగ్ లక్ష్యమని కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే.. ఇలాంటి పేర్లు ఎన్ని చెప్పినా.. ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవడమే జిన్ పింగ్ అసలు లక్ష్యమంటున్నారు!