ప్రముఖ సంగీత విద్వాంసుడు డెబు చౌదరి కన్నుమూత

ప్రముఖ సంగీత విద్వాంసుడు, పద్మభూషణ్ పండిట్ దేవవ్రత్ చౌదరి అలియాస్ డెబు చౌదరి శనివారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో బుధవారం

ప్రముఖ సంగీత విద్వాంసుడు డెబు చౌదరి కన్నుమూత

Pandit Debu Chaudhuri

Pandit Debu Chaudhuri :ప్రముఖ సంగీత విద్వాంసుడు, పద్మభూషణ్ పండిట్ దేవవ్రత్ చౌదరి అలియాస్ డెబు చౌదరి శనివారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో బుధవారం నుంచి ఢిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే శుక్రవారం అర్థరాత్రి గుండెపోటు రావడంతో డెబు చౌదరి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్నీ డెబు చౌదరి కుమారుడు ప్రతీక్ చౌదరి సోషల్ మీడియా ద్వారా నివేదించారు. కళా రంగానికి డెబు చేసిన కృషికి గాను 1992లో భారత ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది.

ప్రముఖ విద్వాంసులు పంచూ గోపాల్ దత్తా, సంగీత ఆచార్య ఉస్తాద్ ముష్తాక్ అలీ ఖాన్ నుండి సంగీతాన్ని అభ్యసించారు. మరోవైపు, నటుడు బిక్రాంజిత్ కన్వర్‌పాల్ కూడా కరోనా యుద్ధంలో ఓడిపోయారు. ఆయన వయసు 52 సంవత్సరాలు.. చిత్ర నిర్మాత అశోక్ పండిట్ కన్వర్‌పాల్ మరణానికి సంతాపం తెలిపారు. ఈ ఉదయం కరోనా కారణంగా నటుడు మేజర్ బిక్రాంజిత్ కన్వర్‌పాల్ మరణం గురించి వినడం విచారకరమని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. కాగా పండిట్ కన్వర్‌పాల్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, దాదాపు 10 సినిమాలు, టీవీ సీరియల్స్ లో నటించారు.