Lemon Juice : వేసవిలో శరీరాన్ని చల్లబరిచే నిమ్మరసం!

వేసవిలో చాలా మంది ఎక్కడ పడితే అక్కడ అందుబాటులో ఉన్న నీటిని తాగేస్తుంటారు. తాగేనీరు కలుషితమైతే ఆ ప్రభావం శరీర ఆరోగ్యంపై పడుతుంది. గొంతు సంబంధిత సమస్యలు వెలుగు చూస్తాయి.

Lemon Juice : వేసవిలో శరీరాన్ని చల్లబరిచే నిమ్మరసం!

Lemon Juice To Cool The Body

Lemon Juice : వేసవిలో మండుతున్న ఎండలకు దాహం అధికంగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రతలు ఎండ వేడి కారణంగా పెరుగుతాయి. అధిక వేడి కారణంగా శరీరంలో శక్తి సన్నగిల్లుతుంది. నిరసంగా అనిపిస్తుంది. అయితే వేసవి కాలంలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచటంలో నిమ్మకాయ ఎంతగానో ఉపకరిస్తుంది. వేసవిలో కాలంలో రోజుకొక గ్లాసు నిమ్మరసం తాగటం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందటమే కాక శరీరం హైడ్రేట్ గా ఉంటుంది.

వేసవిలో నిమ్మరసం తాగటంవల్ల శక్తి తగ్గకుండా చూడటంతోపాటు, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నిమ్మలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి. మానసిక ఒత్తిళ్లను తగ్గించటంతోపాటు, కొత్త ఉత్సాహాన్ని ఇవ్వటంలో నిమ్మకాయ సహాయకారిగా పనిచేస్తుంది. కాలేయంలో పేరుకున్న విషతుల్యాలను తొలగించి కాలేయం జీవితకాలం పెరగటానికి దోహదపడుతుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి మరే ఇతర పండ్లలోను దొరకదు.

వేసవిలో చాలా మంది ఎక్కడ పడితే అక్కడ అందుబాటులో ఉన్న నీటిని తాగేస్తుంటారు. తాగేనీరు కలుషితమైతే ఆ ప్రభావం శరీర ఆరోగ్యంపై పడుతుంది. గొంతు సంబంధిత సమస్యలు వెలుగు చూస్తాయి. ఇలాంటి సమయంలో నిమ్మరసం తీసుకుంటే సమస్య నుండి ఉపశమనం పొందేందుకు అవకాశం ఉంటుంది. వేసవిలో ఎండ వేడికి చర్మపరమైన సమస్యలు వస్తుంటాయి. నిమ్మలో ఉండే విటమిన్ సి వల్ల చర్మం ఛాయ మెరుగవుతుంది. యాంటీ సెఫ్టిక్ గుణాలు నిమ్మలో ఉండటం వల్ల చర్మ సమస్యలు దరి చేరవు.

ప్రతిరోజు ఉదయం , సాయంత్రం గ్లాసు గోరు వెచ్చని నీటిని తీసుకుని అందులో నిమ్మరసాన్ని కలుపుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. శరీరంలో పీహెచ్ స్ధాయిని సమతుల్యంగా ఉంచటంలో నిమ్మరసం తోడ్పడుతుంది. నిమ్మరసం లోని ప్రతికూల అయాన్లు రక్తంలోకి చేరిన సందర్భంలో ఎనర్జీ బూస్టర్ గా పనిచేసి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. వేసవిలో ఎదురయ్యే మలబద్ధకం సమస్యను నిమ్మరసం తాగటం వల్ల తొలగించుకోవచ్చు. కాబట్టి వేసవిలో నిమ్మరసం శరీరానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.