హైదరాబాద్ శివార్లలో చిరుత భయం, మరోసారి తప్పించుకుంది

హైదరాబాద్ శివార్లలో చిరుత పులి కలకలం రేపింది. మైలార్ దేవ్ పల్లి, బుద్వేల్, కాటేదాన్ పరిసరాల్లోని ప్రజలను

  • Published By: naveen ,Published On : May 14, 2020 / 06:40 AM IST
హైదరాబాద్ శివార్లలో చిరుత భయం, మరోసారి తప్పించుకుంది

హైదరాబాద్ శివార్లలో చిరుత పులి కలకలం రేపింది. మైలార్ దేవ్ పల్లి, బుద్వేల్, కాటేదాన్ పరిసరాల్లోని ప్రజలను

హైదరాబాద్ శివార్లలో చిరుత పులి కలకలం రేపింది. మైలార్ దేవ్ పల్లి, బుద్వేల్, కాటేదాన్ పరిసరాల్లోని ప్రజలను చిరుత పులి భయం వెంటాడుతోంది. చిరుతను బంధించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నించారు. అయితే చిరుత తప్పించుకుంది. ఫంక్షన్ హాల్ గోడ దూకి సమీపంలోని పొలాల్లోకి పారిపోయింది. చిరుతను పట్టుకునేందుకు పోలీసులు, అటవీ శాఖ, జూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. చిరుతను బంధించేందుకు బోన్ లను కూడా తెప్పించారు. పొలాల్లోకి పారిపోయిన చిరుత ఆచూకీ కోసం అధికారులు డ్రోన్లను వినియోగించనున్నారు. 

చిరుత కాలికి గాయం:
చిరుత ఎడమ కాలికి గాయమైంది. దీంతో అది వేగంగా పరిగెత్తలేకపోతోంది. గగన్ పహాడ్ బ్రిడ్జి కింద రోడ్లను అధికారులు బ్లాక్ చేశారు. అధికారులు చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నించగా అది పారిపోయింది. పారిపోయే ప్రయత్నంలో ఓ వ్యక్తిపై దాడి చేసింది. అధికారులు వెంటనే ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.

అసలే కరోనా భయం, ఇప్పుడు చిరుత కలకలం:
గురువారం(మే 14,2020) ఉదయం మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధి కాటేదాన్‌ అండర్‌ బ్రిడ్జి రోడ్డుపై స్థానికులు చిరుతపులిని గుర్తించారు. ఎన్‌హెచ్‌-7 ప్రధాన రహదారిపై గాయపడిన చిరుతను స్థానికులు గుర్తించారు. ఆందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రహదారిపై రాకపోకలను నియంత్రించారు. చిరుతను చూసేందుకు జనం భారీగా గుమికూడారు. అటవీశాఖ అధికారులు, జూ పార్క్‌ రెస్క్యూ టీం సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుంది. 4 గంటలుగా ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. సాయంత్రంలోగా చిరుతను బంధిస్తామని, భయపడాల్సిన పని లేదని అధికారులు చెబుతున్నారు. ఓవైపు కరోనా మహమ్మారితో వణికిపోతున్న నగర శివారు ప్రజలకు.. తాజాగా చిరుత భయంపట్టుకుంది. కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

Read Here>> తెలంగాణలో కరోనా కొత్త కేసులు @ 51..వలస కూలీలకు వైరస్