LIC SCHOLARSHIP : ఇంటర్ విద్యార్ధులకు స్కాలర్షిప్ అందిస్తోన్న ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్

అండర్ గ్రాడ్యుయేషన్ పరీక్షల్లో 60 శాతం మార్కులు సాధించాలి. విద్యార్థుల వార్షిక కుటుంబ ఆదాయం రూ. 3,60,000 లోపు ఉండి ఉండాలి. కరోనా సమయంలో తల్లిదండ్రులు లేదా సంరక్షకులను కోల్పోయిన విద్యార్థులకు ప్రాధాన్యతనిస్తారు.

LIC SCHOLARSHIP : ఇంటర్ విద్యార్ధులకు స్కాలర్షిప్ అందిస్తోన్న ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్

LIC SCHOLARSHIP

పదో తరగతి ఉత్తీర్ణులై ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ స్కాలర్షిప్ అందిస్తోంది. ఇంటర్ తొలి సంవత్సరంలో ప్రవేశం పొంది, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆసక్తి గల అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు.

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి గుర్తింపు పొందిన కాలేజీలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను 11వ తరగతి ప్రవేశం పొంది ఉండాలి. అండర్ గ్రాడ్యుయేషన్ పరీక్షల్లో 60 శాతం మార్కులు సాధించాలి. విద్యార్థుల వార్షిక కుటుంబ ఆదాయం రూ. 3,60,000 లోపు ఉండి ఉండాలి. కరోనా సమయంలో తల్లిదండ్రులు లేదా సంరక్షకులను కోల్పోయిన విద్యార్థులకు ప్రాధాన్యతనిస్తారు.

ఎంపికైన విద్యార్థులకు రెండు సంవత్సరాల పాటు స్కాలర్ షిప్ అందిస్తారు. ఏడాదికి రూ. 10, 000 చొప్పున ఇస్తారు. ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్, విద్యార్హత మార్కుల జాబితా, ఆదాయ దృవీకరణ పత్రం , ప్రస్తుతం ప్రవేశం పొందిన కాలేజ్ ఐడి, లేదా బోనఫైడ్ సర్టిఫికెట్ , ప్రస్తుత విద్యా సంవత్సరం ఫీజు రిసిప్ట్, బ్యాంక్ అకౌంట్ వివరాలు , కులధృవీకరణ పత్రం తదితర పత్రాలు కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకునేందుకు చివరితేది సెప్టెంబర్ 30, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్: https://www.buddy4study.com