పంచె కట్టిన నట్టూ.. కూతురు పేరు ఏంటంటే?

పంచె కట్టిన నట్టూ.. కూతురు పేరు ఏంటంటే?

ఐపీఎల్‌లో రాణించి తర్వాత ఆస్ట్రేలియా టూర్‌లో సత్తాఛాటిన యంగ్ బౌలర్ నటరాజన్.. ఇప్పుడు ఆస్ట్రేలియా టూర్ తర్వాత పూర్తిగా ఇంటికి పరిమితం అయ్యాడు. లేటెస్ట్‌గా నట్టూ అని ముద్దుగా అభిమానులు పిలుచుకునే నటరాజన్.. కుమార్తె జన్మించి నాలుగు నెలలు పూర్తైన సందర్భంగా భార్య, బిడ్డతో కలిసి ఉన్న ఫొటో షేర్‌ చేసి ఈ మేరకు ఉద్వేగపూరిత కామెంట్‌ జతచేశాడు. కూతుళ్లే బెస్ట్‌ అంటూ పుత్రికోత్సాహంతో పొంగిపోయాడు.

“జీవితంలో మేము అందుకున్న అత్యంత అందమైన బహుమతి నువ్వే. మా జీవితాలు ఇంత సంతోషకరంగా మారడానికి కారణం నువ్వే. మమ్మల్ని నీ తల్లిదండ్రులుగా ఎంచుకున్నందుకు థాంక్యూ లడ్డూ. ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం. మా చిన్నారి దేవత హన్విక’’ అంటూ తన భార్య, కూతురుతో పంచె కట్టులో ఉన్న ఫోటోను పంచుకున్నాడు.

నవంబర్‌లో ఐపీఎల్ సమయంలో నటరాజన్ తండ్రి కాగా.. లేటెస్ట్‌గా తన కూతురు పేరగను వెల్లడించాడు నట్టూ. మా చిన్నారి దేవత హన్విక.. అంటూ తన కూతురి పేరును తెలిపాడు నట్టూ. హన్విక అంటే సరస్వతి మరియు లక్ష్మీ దేవి యొక్క నెమలి అని అర్థం.

అయితే, ఈ పేరు పెట్టడంతో నటరాజన్‌పై కొందరు తమిళ ఫ్యాన్స్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళంలో పేరు పెట్టకుండా..ఉత్తరాది పేరు పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. తమిళంలో పేరు పెట్టొచ్చు కదా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక త్వరలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఆడే భారత జట్టులో నటరాజన్‌కు చోటు దక్కింది. మార్చి 12 నుంచి 20 మార్చి వరకు అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో జరిగే టీ20 మ్యాచ్‌లలో నట్టూ ఆడబోతున్నాడు.

 

 

View this post on Instagram

 

A post shared by Natarajan Jayaprakash (@natarajan_jayaprakash)