Liger: ఊరమాస్ ట్రీట్‌గా లైగర్ కోకా 2.0 పాట!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ ఇప్పటికే దేశవ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ మూవీగా మారింది. ఈ సినిమాను దర్శకుడు పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుండి కోకా 2.0 అనే సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఔట్ అండ్ ఔట్ మాస్ ట్రీట్‌గా ఈ పాట ఉండటంతో రౌడీ ఫ్యాన్స్ ఈ పాటకు ఉర్రూతలూగుతున్నారు.

Liger: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ ఇప్పటికే దేశవ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ మూవీగా మారింది. ఈ సినిమాను దర్శకుడు పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో భారీ విజయంపై కన్నేశాడు విజయ్ దేవరకొండ. ఇక ఈ సినిమాను దేశవ్యాప్తంగా జనంలోకి తీసుకెళ్లేందుకు లైగర్ చిత్ర యూనిట్ భారీ ఎత్తున ప్రమోషన్స్ నిర్వహిస్తోంది.

Liger: పక్కా దేశీ స్టైల్‌లో కేక పెట్టిస్తున్న లైగర్!

తాజాగా ఈ సినిమా నుండి కోకా 2.0 అనే సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఔట్ అండ్ ఔట్ మాస్ ట్రీట్‌గా ఈ పాట ఉండటంతో రౌడీ ఫ్యాన్స్ ఈ పాటకు ఉర్రూతలూగుతున్నారు. క్రేజీ సింగర్ రామ్ మిర్యాల, గీతా మాధురిలు ఈ పాటను ఫుల్ ఎనర్జీతో పాడగా, విజయ్ దేవరకొండ, అనన్యాలు ఈ పాటలో అదిరిపోయే మాస్ స్టెప్పులతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ మాస్ పాటకు భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించగా.. జానీ, లిజో జార్జ్, డీజే చీతాస్ ఈ పాటను కంపోజ్ చేశారు.

Liger: రికార్డులు క్రియేట్ చేస్తోన్న లైగర్ ‘ఆఫత్’ సాంగ్!

ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది. ఇక ఆగస్టు 25న లైగర్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాలో ప్రపంచ ప్రసిద్ధ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, రమ్యకృష్ణ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను పూరీ జగన్నాధ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్‌లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ కోకా 2.0 సాంగ్ పై మీరు ఓ లుక్కేయండి.

ట్రెండింగ్ వార్తలు