‘లైగర్’ వచ్చేది ఎప్పుడంటే..

LIGER Release Date: టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో.. ధర్మా ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ.. ‘లైగర్’.. ‘సాలా క్రాస్ బీడ్’ అనేది ట్యాగ్ లైన్..
ఈ సినిమా కోసం విజయ్ ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకున్నాడు. బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే కథానాయికగా నటిస్తోంది. లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడ్డ ‘లైగర్’ షూటింగ్ నేటి నుండి (ఫిబ్రవరి 11) ముంబైలో పున:ప్రారంభమైంది.
గురువారం ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 9న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ మరియు మలయాళ భాషల్లో ‘లైగర్’ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కరణ్ జోహార్, పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, అపుర్వా మెహతా, హిరూ యష్ జోహార్ నిర్మిస్తున్నారు.
https://10tv.in/vijay-deverakondas-liger-title-and-firstlook/
‘లైగర్’ అంటే పులికి, సింహానికి పుట్టిన బిడ్డ అని అర్థం. పోస్టర్ బ్యాగ్రౌండ్‌లో ఓ వైపు పులి, మరో వైపు సింహం కనిపిస్తుండగా.. విజయ్ చేతులకు బాక్సింగ్ గ్లవ్స్‌తో ఒత్తైన జుత్తు, గెడ్డంతో సరికొత్త అవతార్‌లో ప్రత్యర్థికి పంచ్ విసురుతూ కనిపించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.