Bijili Mahadev Temple : ఏడాదికోమారు శివలింగంపై పిడుగులు….మహిమాన్వితమైన పిడుగుల పరమేశ్వరాలయం..ఎక్కడంటే..

ఈ శివలింగం నిత్యం పిడుగుపాటుకు గురవుతుండటం వల్లే ఈ ఆలయానికి బిజిలీ మహాదేవ్ గా పిలుస్తారు.

10TV Telugu News

Bijili Mahadev Temple : లింగ స్వరూపంలో పూజలందుకునే పరమశివుడంటే భక్తులకు అమితమైన విశ్వాసం. పరమశివునికి గ్రామగ్రామాన దేవాలయాలు నిర్మించి పూజలు నిర్వహిస్తూ భక్తులు తమ భక్తిని చాటుకుంటున్నారు. అయితే వీటిలో ఎంతో ప్రసిద్ధ చరిత్ర గలిగిన ఆలయాలు చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో ముఖ్యమైనది హిమాచల్ ప్రదేశ్ లోని కులుకు సమీపంలో ఉన్న బిజిలీ మహదేవ్ ఆలయం. ఈ ఆలయానికి ఎంతో విశిష్ట ఉంది.

ఇక్కడ ఉన్న శివలింగం ప్రతిఏటా పిడుగుపడి ముక్కలై పోతుంది. కొద్దిరోజుల్లోనే అది సాధారణ స్ధితికి చేరుకుంటుంది. ఏడాదిలో ఒక్కసారైనా ఈ శివలింగంపై పిడుగు పడుతుంది. పిడుగు పడిన సమయంలో ముక్కలైన శివలింగాన్ని పూజారులు ఒకచోటకు చేరుస్తారు. తృణధాన్యాలు, పిండి, వెన్నతో తిరిగి లింగంగా మారుస్తారు. కొద్దిరోజులకే ఎలాంటి పగుళ్ళు కనిపించకుండా లింగం పూర్వస్ధితిలోకి చేరుకుంటుంది.

ఈ శివలింగం నిత్యం పిడుగుపాటుకు గురవుతుండటం వల్లే ఈ ఆలయానికి బిజిలీ మహాదేవ్ గా పిలుస్తారు. బిజిలీ అంటే విద్యుత్ లేదా పిడుగు నుండి వెలువడే కాంతి అని అర్ధం అందుకే ఆపేరు వచ్చింది. కులంతా అనే రాక్షసుడిని శివుడు ఇక్కడ సంహరించినందునే ఆతరువాత కాలంలో దీనిని కులుగా అంతా సంబోధిస్తున్నట్లు పురాణాలు చెబుతున్నాయి.

ఇక్కడి శివలింగం పిడుగుపాటుగు గురైనా తిరిగి యాధాస్ధితికి రావటంపై అనేక మంది పరిశోధనలు చేశారు. పిడుగుకారణంగా పగిలిని ముక్కలను జిగురులాంటి గమ్ తో అంటించినా అతుక్కోదు, పూజారులు తయారు చేసే పిండి, తృణధాన్యాలతో అతికిస్తేనే శివలింగం సాధారణ స్ధితికి చేరుతుంది. అంతుచిక్కని ఈ మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు.

కులుకు 22 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఆలయ శిఖరంపైకి చేరుకునేందుకు 1000 మెట్లను ఎక్కాల్సి ఉంటుంది. శివరాత్రిరోజున భక్తులు అధికసంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. డిసెంబర్, జనవరి మాసాల్లో ఈ ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉంటుంది. ప్రకృతి అందాల నడుమ ఉన్న 3కిలోమీటర్ల మేర సాగే ట్రక్కింగ్ ఎంతో అనుభూతినిస్తుంది.

10TV Telugu News