PM Modi: ‘కాళి’ వివాదంపై స్పందించిన ప్రధాని మోదీ..! ఏమన్నారంటే..

‘కాళీ’ వివాదంపై ప్రధాని మోదీ స్పందించారు.. లోక కళ్యాణం కోసం ఆథ్యాత్మిక శక్తితో ముందుకు సాగుతున్న భారతదేశానికి కాళీమాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. ఈ ప్రపంచం మొత్తం అమ్మవారి చైతన్యంతో వ్యాపించి ఉందని, ఈ చైతన్యం బెంగాల్ కాళీమాత పూజలో కనిపిస్తుందన్నారు. ఈ స్పృహ బెంగాల్, దేశం యొక్క విశ్వాసంలో కనిపిస్తుందని మోదీ పేర్కొన్నారు.

PM Modi: ‘కాళి’ వివాదంపై స్పందించిన ప్రధాని మోదీ..! ఏమన్నారంటే..

Kaali Matha

PM Modi: దేశంలో ‘కాళి’ వివాదం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. దర్శకురాలు లీనా మణిమేకలై తన కొత్త డాక్యుమెంటరీ ‘కాళి’ పోస్టర్‌లో కాళీమాత సిగరేట్ తాగుతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ పట్ల హిందు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మొయిత్రా వ్యాఖ్యలు వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. కాళీమాత తన దృష్టిలో మాంసం తిని, మద్యంతాగే దేవత అని ఆమె అన్నారు. ఎంపీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కాళీమాతను అవమానించేలా మాట్లాడిన మొయిత్రా ను తృణమూల్ కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలని బీజేపీ శ్రేణులు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో మొయిత్రా వ్యాఖ్యలను టీఎంసీ అధిష్టానం పార్టీ ట్విటర్ ఖాతాలో ఖండించింది. ఆమె వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. ఎంపీ మొయిత్రా మాత్రం.. తన వ్యాఖ్యలపై వెనక్కు తగ్గలేదు. హిందూ ధర్మాన్ని బీజేపీ ఏమైనా లీజుకు తీసుకుందా? కాళీమాతను ఎలా పూజించాలో వాళ్లు చెప్పడమేంటి అని ప్రశ్నించింది. బెంగాల్ లో సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయని మొయిత్రా తన ట్విటర్ ఖాతాలో ఘాటుగా స్పందించింది.

Kaali poster dispute: కాళీమాత పోస్టర్‌పై టీఎంసీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు.. వారిపై యూపీలో కేసు నమోదు

బీజేపీ శ్రేణులు మాత్రం ఆమెను టీఎంసీ నుంచి సస్పెండ్ చేయాలని బెంగాల్ లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాళీమాత అంశంపై మోదీ మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే మోదీ సినిమా పోస్టర్‌పై గాని, టీఎంసీ ఎంపీ పేరును గానీ ఎక్కడా ప్రస్తావించలేదు. ఆదివారం స్వామి ఆత్మస్థానానంద శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. లోక కళ్యాణం కోసం ఆథ్యాత్మిక శక్తితో ముందుకు సాగుతున్న భారతదేశానికి కాళీమాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. స్వామి రామకృష్ణ పరమహంస కాళీమాత యొక్క దర్శనం పొందినటువంటి సాధువులలో ఒకరని, కాళిమాత పాదాల వద్ద తన సర్వస్వాన్ని సమర్పించారని అన్నారు. ఈ ప్రపంచం మొత్తం అమ్మవారి చైతన్యంతో వ్యాపించి ఉందని, ఈ చైతన్యం బెంగాల్ కాళీ పూజలో కనిపిస్తుందన్నారు. ఈ స్పృహ బెంగాల్, దేశం యొక్క విశ్వాసంలో కనిపిస్తుందని మోదీ పేర్కొన్నారు.

Goddess Kali row : ‘‘ హిందూ ధర్మాన్ని బీజేపీ లీజుకు తీసుకుందా..?దేవుళ్లను ఎలా ప్రార్థించాలో నేర్పించటానికి మీరెవరు?’’

ప్రధాని మోదీ ఇంకా మాట్లాడుతూ.. నాకు అవకాశం దొరికినప్పుడల్లా నేను బేలూర్ మఠాన్ని (ధఖినేశ్వర్) కాళీ ఆలయాన్ని (నది అవతల) సందర్శించడం సహజం అన్నారు. మీ విశ్వాసం, విశ్వాసాలు స్వచ్ఛంగా ఉన్నప్పుడు కాళీమాత మీకు మార్గాన్ని చూపుతుందని ప్రధాని తెలిపారు. కాళీమాత యొక్క అపరిమితమైన ఆశీర్వాదాలు భారతదేశానికి ఎల్లప్పుడూ ఉంటాయని, ఈ ఆథ్యాత్మిక శక్తితో దేశం, ప్రపంచ కల్యాణం కోసం ముందుకు సాగుతోందని మోదీ పేర్కొన్నారు.