Lingu Swamy : ‘వరిసు’కి థియేటర్స్ ఇవ్వకపోతే పరిస్థితులు ఇంకోలా ఉంటాయి.. వార్నింగ్ ఇచ్చిన డైరెక్టర్ లింగుస్వామి..

తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇచ్చిన ఈ నోటీసుపై తమిళ తమిళ దర్శక నిర్మాతలు మండిపడుతున్నారు. మా తమిళ సినిమాల రిలీజ్ లు తెలుగులో ఆపితే తెలుగు సినిమాలని ఇక్కడ కూడా రిలీజ్ ఆపుతాం. అయినా వరిసు హీరో.............

Lingu Swamy : ‘వరిసు’కి థియేటర్స్ ఇవ్వకపోతే పరిస్థితులు ఇంకోలా ఉంటాయి.. వార్నింగ్ ఇచ్చిన డైరెక్టర్ లింగుస్వామి..

Lingu Swamy warning to telugu producers council

Lingu Swamy :  తమిళ్ స్టార్ హీరో విజయ్ తో దిల్ రాజు నిర్మాతగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘వరిసు’ సినిమా తెరకెక్కుతుంది. దీన్నే తెలుగులో ‘వారసుడు’గా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్టు దిల్ రాజు ఇప్పటికే ప్రకటించారు. అయితే దిల్ రాజు మొదట ఈ సినిమా తెలుగు సినిమా అని చెప్పారు. కానీ తెలుగు సినిమా షూటింగ్స్ ఆపినప్పుడు వరిసు ఆపకుండా అది తమిళ్ సినిమా అని చెప్పడంతో కొంతమంది విమర్శించారు.

ఇటీవల తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి గతంలో దిల్ రాజు చెప్పిన మాటలనే ఆధారంగా తీసుకొని పండగల సమయంలో ముందుగా తెలుగు సినిమాలకే థియేటర్స్ ఇవ్వాలి, చివరి ప్రాధాన్యత వేరే భాషా సినిమాలకి ఇవ్వాలని ఓ నోటీసు విడుదల చేశారు. అంటే ఈ సంక్రాంతికి తెలుగులు సినిమాలకే థియేటర్స్ ఇవ్వాలని వరిసుకి థియేటర్స్ ఎక్కువగా ఇవ్వొద్దని ఇండైరెక్ట్ గా చెప్పారు. దీనిపై దిల్ రాజు స్పందించకపోయినా ఓ ఈవెంట్ లో అల్లు అరవింద్ స్పందిస్తూ అది జరిగే పని కాదు అని ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి కౌంటర్ ఇచ్చారు.

ఇక తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇచ్చిన ఈ నోటీసుపై తమిళ తమిళ దర్శక నిర్మాతలు మండిపడుతున్నారు. మా తమిళ సినిమాల రిలీజ్ లు తెలుగులో ఆపితే తెలుగు సినిమాలని ఇక్కడ కూడా రిలీజ్ ఆపుతాం. అయినా వరిసు హీరో ఒక్కడే తమిళ్ మిగిలిన క్రూ అంత తెలుగు వాళ్ళే, అది తెలుగు సినిమానే అంటున్నారు. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ విడుదల చేసిన నోటీసుపై తమిళ నిర్మాతలు నవంబర్ 22న భేటీ కానున్నారు.

Ragini Dwivedi : షూటింగ్‌లో గాయపడిన హీరోయిన్.. శరీరం తట్టుకోగలదు కానీ మనసే.. అంటూ ఎమోషనల్ పోస్ట్..

ఇంతలోనే పలువురు తమిళ ప్రముఖులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ.. ”వరిసుకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో సరిపడా థియేటర్స్ ఇవ్వకపోతే రాబోయే కాలంలో పరిస్థితులు మరోలా ఉంటాయి. బిఫోర్ వరిసు, ఆఫ్టర్ వరిసులా ఉంటాయి” అని హెచ్చరించారు. మరికొంతమంది తమిళ ప్రముఖులు కూడా ఇదేవిధంగా మాట్లాడారు. దీంతో ఒక్క సినిమా వివాదం కాస్త రెండు సినీ పరిశ్రమల వివాదంలా మారింది.