Lionel Messi : స్టార్ ఫుట్ బాలర్‌కు కరోనా.. కోవిడ్‌పై అలా పోస్టు పెట్టాడు.. ఇలా పాజిటివ్ వచ్చింది!

అర్జెంటీనా స్టార్‌ ఫుట్‌బాలర్‌ లియోనల్ మెస్సీ (Lionel Messi) కరోనా సోకింది. కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అతడు ఐసోలేట్ అయ్యాడు.

Lionel Messi : స్టార్ ఫుట్ బాలర్‌కు కరోనా.. కోవిడ్‌పై అలా పోస్టు పెట్టాడు.. ఇలా పాజిటివ్ వచ్చింది!

Lionel Messi Tests Positive For Covid, Isolates In Argentina

Lionel Messi : అర్జెంటీనా స్టార్‌ ఫుట్‌బాలర్‌ లియోనల్ మెస్సీ (Lionel Messi) కరోనా సోకింది. కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అతడు ఐసోలేట్ అయ్యాడు. లియోనల్ మెస్సీతో పాటు అతడి జట్టులోని మరో ముగ్గురు ఫుట్ బాలర్లు కూడా కరోనా బారిన పడ్డారు. ప్రముఖ ఫుట్ బాల్ క్లబ్ పారిస్ సెయింట్ జైర్మైన్ (PSG)కు లియోనల్ మెస్సీ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

ఈ జట్టులోని ఆటగాళ్లు కరోనా బారినపడటంతో వీరంతా మ్యాచ్ ఆడలేని పరిస్థితి ఎదురైంది. ఫ్రెంచ్ కప్‌లో భాగంగా సోమవారం లియోనల్ మెస్సీ టీం మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే ఆటగాళ్లకు కరోనా నిర్ధారణ అయినట్లు పీఎస్‌జీ ఒక ప్రకటనలో వెల్లడించింది. కరోనా సోకిన ఆటగాళ్లంతా ఐసొలేషన్‌లో ఉన్నట్లు పీఎస్‌జీ తెలిపింది. జట్టులోని మరో స్టార్‌ ఆటగాడు నెయ్‌మార్‌కు మాత్రం నెగిటివ్‌ వచ్చినట్లు PSG వెల్లడించింది. కోవిడ్‌కు సంబంధించి మెస్సీ సోషల్‌మీడియాలో పోస్ట్‌ పెట్టిన తర్వాత అతడు కరోనా బారినపడినట్టు నిర్ధారణ అయింది.

పారిస్ సెయింట్-జర్మైన్ బృందం తన రెగ్యులర్ మెడికల్ అప్‌డేట్‌లో తెలిపింది. మెస్సీ తన స్వదేశమైన అర్జెంటీనాలో ఉన్నాడు. కోవిడ్ నెగటివ్ వచ్చేంత వరకు అతడు అక్కడే ఉండనున్నాడు. లియో మెస్సీ వైద్య బృందంతో ఎప్పుటికప్పుడూ సంప్రదింపులు జరుపుతున్నాడు. అర్జెంటీనాలో నెగిటివ్ తేలే వరకు అతను ఫ్రాన్స్‌కు వెళ్లే పరిస్థితి లేదని పీఎస్‌జీ జట్టు మేనేజర్ మారిసియో పోచెట్టినో చెప్పారు.

Read Also : Covid Vaccination : నేటి నుంచే 15-18 ఏళ్ల పిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్.. స్పెషల్ సెంటర్ల ఏర్పాట్లు!