క్రీడల చరిత్రలోనే మెస్సీ కొత్త రికార్డు.. రూ.4వేల 920కోట్ల ఒప్పొందం!

క్రీడల చరిత్రలోనే మెస్సీ కొత్త రికార్డు.. రూ.4వేల 920కోట్ల ఒప్పొందం!

అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ ఒప్పందం ఇప్పుడు ప్రపంచ క్రీడా చరిత్రలో కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఆల్‌టైమ్ బెస్ట్ ఫుట్‌బాల్ ప్లేయ‌ర్స్‌లో ఒక‌డిగా పేరుగాంచిన మెస్సీకి స్పోర్ట్స్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక మొత్తాన్ని బార్సిలోనా ఇవ్వ‌నున్న‌ట్లు స్పానిష్ ప‌త్రిక ఎల్ మండో వెల్ల‌డించింది.

మెస్సీ నాలుగు సీజన్లలో స్పానిష్ ఫుట్‌బాల్ క్లబ్ బార్సిలోనాతో పెద్ద ఒప్పందం కుదుర్చుకుంది. బార్సిలోనాతో వారి ప్రస్తుత ఒప్పందం 5.55 మిలియన్ యూరోలు (63.3 మిలియన్ డాలర్లు), ఇది క్రీడా చరిత్రలో అత్యంత ఖరీదైన ఒప్పందం. బార్సిలోనా క్ల‌బ్ మొత్తం నాలుగు సీజ‌న్లు క‌లిపి మెస్సీకి 55,52,37,619 యూరోలు (సుమారు రూ.4920 కోట్లు) ఇవ్వ‌నున్న‌ట్లు ఆ ప‌త్రిక వెల్ల‌డించింది.

కాంట్రాక్ట్‌లోని అన్ని నియ‌మ నిబంధ‌న‌ల‌కు మెస్సీ క‌ట్టుబ‌డి ఉన్న‌ట్ల‌యితే ఈ భారీ మొత్తం అత‌నికి ద‌క్కుతుంద‌ని ఆ రిపోర్ట్‌లో స్ప‌ష్టం చేసింది. బార్సిలోనాతో మెస్సీ కాంట్రాక్ట్ మ‌రో ఐదు నెల‌లు ఉంది. అయితే ఇప్ప‌టికే మెస్సీ 51,15,40,545 యూరోలు సంపాదించిన‌ట్లు ఎల్ మండో ప‌త్రిక త‌న రిపోర్ట్‌లో తెలిపింది.

ఈ కాంట్రాక్ట్‌లో ఏ కేట‌గిరీ కింద మెస్సీ ఎంత అందుకోబోతున్నాడో కూడా ఆ ప‌త్రిక వివ‌రించింది. వేరియ‌బుల్స్ అన్నీ క‌లిపి మెస్సీకి ప్ర‌తి సీజ‌న్‌కూ బార్సిలోనా 13,80,00,000 యూరోలు ఇవ్వ‌డానికి అంగీక‌రించిన‌ట్లు ఆ రిపోర్ట్ బ‌య‌ట‌పెట్టింది. కాంట్రాక్ట్ రెన్యువల్ చేసుకోవ‌డానికి అంగీక‌రించినందుకే మెస్సీకి 11,52,25,000 యూరోల సైనింగ్‌-ఆన్ బోన‌స్ ఇవ్వ‌నుంది బార్సిలోనా. ఇక లాయ‌ల్టీ బోన‌స్ కింద మ‌రో 7,79,29,955 యూరోల బోన‌స్ ద‌క్క‌నుంది.