Special Corona Fee : మద్యం బాటిళ్లపై 70 శాతం పెంపు

  • Published By: madhu ,Published On : May 5, 2020 / 01:59 AM IST
Special Corona Fee : మద్యం బాటిళ్లపై 70 శాతం పెంపు

కరోనా రాకాసి గత 40 రోజులుగా మూతపడిన మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. దీంతో మందుబాబులు ఫుల్ ఖుష్ అయ్యారు. పండుగ చేసుకున్నారు. ఉదయాన్నే లిక్కర్ షాపుల ఎదుట క్యూలు కట్టారు. ఉదయం 11 నుంచి రాత్రి 07 గంటల వరకు మద్యం విక్రయాలు జరిపారు.

అయితే..కొన్ని రాష్ట్రాలు మద్యం సేవించే వారికి షాక్ లు ఇస్తున్నాయి. రేట్లను పెంచేస్తున్నారు. ఏపీలో 25 శాతం ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో ఢిల్లీ చేరింది. ఎక్సైజ్ రిటైల్ లైసెన్స్ ల ద్వారా విక్రయించే అన్ని మద్యం బాటిళ్లపై ఏకంగా 70 శాతం ధరలు పెంచుతున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకు 2020, మే 04వ తేదీ సోమవారం అర్ధరాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. 

ఢిల్లీలో సోమవారం లిక్కర్ షాపులు తెరుచుకున్నాయి. సోషల్ డిస్టెన్స్ పాటించాలని, కనీసం ఆరు అడుగుల దూరం నిలబడాలని, కొన్ని నిబంధనలు విధించింది కేంద్రం. కానీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో నిబంధనలు పాటించలేదు. మద్యం అమ్మకాలతో అధిక ఆదాయం సంపాదించుకోవాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. రేట్లను పెంచుతున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం కరోనా సెస్ విధించనుంది. కరోనా ఫీ పేరిట ఏకంగా 70 శాతం సుంకం విధించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో మంగళవారం నుంచి మద్యం ధరలు పెరగనున్నాయి. 

ఢిల్లీలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6.30గంటల వరకు షాపులు తెరుస్తున్నారు. సోమవారం మందుబాబులు క్యూ కట్టారు. సోషల్ డిస్టెన్స్ పాటించాలని బందోబస్తులో ఉన్న పోలీసులు సూచించారు. కానీ కొన్ని ప్రాంతాల్లో బేఖాతర్ చేశారు. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. కొన్ని ఏరియాల్లో షాపులను మూసివేసే పరిస్థితి వచ్చింది. తాజాగా సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎలాంటి స్పందనలు వ్యక్తం అవుతాయో చూడాలి మరి. 

Also Read | మందుబాబులకు ఏపీ ప్రభుత్వం షాక్, మద్యం ధరలు 25శాతం పెంపు