BJP: ప్రధాని వేదికపై కూర్చునే అతిథుల పేర్లు ఖరారు

ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా, యూపీ సీఎం ఆదిత్యా నాథ్, ఇతర కీలక నేతలు ఈ సభలో పాల్గొనబోతున్నారు. ఈ సభకు సంబంధించి మూడు ప్రధాన వేదికలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు.

BJP: ప్రధాని వేదికపై కూర్చునే అతిథుల పేర్లు ఖరారు

BJP: ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్న విజయ సంకల్ప సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా, యూపీ సీఎం ఆదిత్యా నాథ్, ఇతర కీలక నేతలు ఈ సభలో పాల్గొనబోతున్నారు. ఈ సభకు సంబంధించి మూడు ప్రధాన వేదికలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై ప్రధాని మోదీతోపాటు కూర్చునే 39 మంది పేర్లను అధికారులు ఖరారు చేశారు. ప్రధాన వేదికకు ఎడమవైపు ఉన్న మరో వేదికపై 103 మంది కూర్చుంటారు.

Mexico Mayor: మొసలిని పెళ్లి చేసుకున్న మేయర్.. ఎందుకో తెలుసా!

సభకు కుడి వైపు మరో 80 మంది కూర్చునేలా ఇంకో వేదిక ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నద్దా, అమిత్ షా, పీయూష్ గోయల్, తరుణ్ చుగ్, యోగి ఆదిత్యానాథ్, నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్, బండి సంజయ్, కిషన్ రెడ్డి, డీకే అరుణ, లక్ష్మణ్, రాజా సింగ్, మురళీ ధర్ రావు, ఇంద్ర సేనా రెడ్డి, పొంగులేటి జితేందర్ రెడ్డి, వివేక్, గరికపాటి మోహన్ రావు, ఈటల రాజేందర్, విజయ శాంతి, ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు కూర్చుంటారు. సభా వేదిక స్థలాన్ని పరిశీలించేందుకు బండి సంజయ్ మరికాసేపట్లో సభా వేదిక వద్దకు చేరుకుంటారు.