అనంతలో KIA : గంటకు 30..రోజుకు 200 కార్ల తయారు

  • Published By: madhu ,Published On : May 13, 2020 / 01:46 AM IST
అనంతలో KIA : గంటకు 30..రోజుకు 200 కార్ల తయారు

KIA కార్ల పరిశ్రమలో ఉత్పత్తి స్టార్ట్ అయ్యింది. ఏపీలోని అనంతపురం జిల్లా పెనుగొండ మండలంలో కియా పరిశ్రమ ఉన్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం మూడుసార్లు లాక్ డౌన్ ను కొనసాగించింది. ప్రస్తుతం 2020, మే 17 వరకు కొనసాగనుంది. అయితే..కొన్నింటికి సడలింపులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో…కియా పరిశ్రమ మూతపడింది. ఇటీవలే కొందరు కార్మికులు, సూపర్ వైజర్లతో నిర్వహణ పనులు చేపట్టారు.

ఐదు రోజులుగా ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం. లాక్ డౌన్ కు ముందు ఈ పరిశ్రమలో నాలుగు వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం 30 శాతం మేర విధులకు హాజరవుతున్నారని తెలుస్తోంది. షిప్టుల ప్రకారం (8 గంటలు) ప్రకారంగా పనులు చేస్తున్నారు. దీంతో కార్ల ఉత్పత్తి పనులు చకచకా జరుగుతున్నాయి. గంటకు 30 కార్ల చొప్పున రోజుకు 200 నుంచి 240 కార్లు తయారు చేస్తున్నారు. 

మరోవైపు కార్మికులు, ఇతరులు హాజరవతుండడంతో కియా పరిశ్రమ యాజమాన్యం తగిన జాగ్రత్తలు తీసుకొంటోంది. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ముందస్తు ఏర్పాట్లు చేసింది. ప్రధాన గేటు వద్ద, అవసరమైన చోట్ల జాగ్రత్తలు పాటిస్తున్నారు. 

కియా పరిశ్రమ అనంతపురం జిల్లాకు పారిశ్రామిక వన్నె తెచ్చింది. ఇక్కడ తయారవుతున్న కార్లు దేశంలోని అన్ని నగరాలకు సరఫరా అవుతున్నాయి. దక్షిణి కొరియాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ గ్రూప్ కంపెనీ కియా మోటార్స్ భారత్ లో తన తొలి మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ను ఏపీలోని అనంతలో నెలకొల్పింది.

సుమారు 1.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. కియా తన తొలి ఉత్పత్తి కియా సెల్టోస్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. కియా మోటార్స్ కు అనంతలో 600 ఎకరాల భూమిని కేటాయించిన సంగతి తెలిసిందే. 

Read Here >>> మానవతా దృక్పథంతో ఆలోచించండి: సీఎం జగన్