Unlock Relax : లాక్‌డౌన్ స‌డ‌లింపులు..భారీగా రోడ్ల‌పైకి వ‌చ్చిన జ‌నాలు

కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను ఢిల్లీ, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాలు నేటి నుంచి స‌డ‌లించాయి. మ‌హారాష్ట్ర‌లో ద‌శ‌ల వారీగా అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభించాల‌ని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు ఐదు దశల్లో ఆంక్షలను సడలిస్తున్నారు. స‌డ‌లింపులు ఇచ్చిన న‌గ‌రాల్లో జ‌నాలు రోడ్ల‌పైకి పెద్ద ఎత్తున వ‌చ్చేశారు. దీంతో ప‌లు ప్రాంతాలు ర‌ద్దీగా క‌న‌ప‌డుతున్నాయి.

Unlock  Relax : లాక్‌డౌన్ స‌డ‌లింపులు..భారీగా రోడ్ల‌పైకి వ‌చ్చిన జ‌నాలు

Lock Down

Unlock Relax : కరోనా నియంత్రణ కోసం విధించిన లాక్ డౌన్ లతో జనాలు ఇళ్లకే పరిమితం అయిపోయి ఏదో జైల్లో ఉన్నట్లుగా ఫీల్ అవుతున్నారు. ఇల్లుకదలనానికి లేదు. పనులు ఉన్నా..లాక్ డౌన్ నిబంధన మేరకే కంప్లీట్ చేసేసుకోవాల్సిన పరిస్థితి. తిరిగి మళ్లీ ఇళ్లల్లోనే ఉండిపోవాలి. దీంతో జనాలకు బంధీఖానాలో ఉన్నట్లుగా ఫీల్ అయిపోయిన పరిస్థితి.ఎప్పుడు లాక్ డౌన్ ఎత్తేస్తారా? అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ, మ‌హారాష్ట్ర‌లో లాక్ డౌన స‌డ‌లింపులతో జనాలు ఒక్కసారిగా రోడ్లమీదకు వచ్చేశారు. హమ్మయ్యా అనుకుంటూ ఎవరి పనులలో వారు పడ్డారు.దీంతో బంస్టాండ్లు..వంటి పబ్లిక్ ప్లేసుల్లో జనాలు భారీ సంఖ్యలో కనిపిస్తున్నారు. లాక్ డౌన్ సడలింపులతో కరోనా భయంకూడా పోయినట్లుంది జనాలకు. కనీసం భౌతిక దూరం కూడా పాటించట్లేదు. ఎవరి పనుల్లో వాళ్లు బిజీ బిజీ అయిపోయారు.

కాగా..కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను ఢిల్లీ, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాలు నేటి నుంచి స‌డ‌లించాయి. మ‌హారాష్ట్ర‌లో ద‌శ‌ల వారీగా అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభించాల‌ని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు ఐదు దశల్లో ఆంక్షలను సడలిస్తున్నారు. స‌డ‌లింపులు ఇచ్చిన న‌గ‌రాల్లో జ‌నాలు రోడ్ల‌పైకి పెద్ద ఎత్తున వ‌చ్చేశారు. దీంతో ప‌లు ప్రాంతాలు ర‌ద్దీగా క‌న‌ప‌డుతున్నాయి. బ‌స్టాండ్ల‌లో క‌రోనా నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌లు చేయ‌డంతో లైన్‌లో నిల‌బ‌డి బ‌స్సులు ఎక్కుతున్నారు. ఢిల్లీలోనూ నేటి నుంచి వ్యాపార, వాణిజ్య‌, రవాణా కార్యకలాపాలు, షాపింగ్ మాల్స్ తెరుచుకోవ‌డంతో జనాలు రోడ్ల‌పై పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. బయట తిరగటానికి మొహం వాచిపోయినట్లుగా ..ఏదో స్వేచ్చలోకి వచ్చినట్లుగా ఫీల్అవుతున్నారు.

కనీసం క‌రోనా నిబంధ‌న‌ల‌ను ప‌ట్టించుకోకుండా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఢిల్లీలో ప్ర‌యాణికులు పెద్ద ఎత్తున‌ మెట్రో రైళ్ల‌లో ప్ర‌యాణిస్తున్నారు. లాక్ డౌన్ సండలించటంతో ముంబై, ఢిల్లీ నుంచి సొంత ప్రాంతాల‌కు వెళ్లిన వ‌ల‌స కార్మికులు తిరిగి ఉపాధి కోసం తిరిగి వస్తున్నారు. కాగా..ఢిల్లీ, మ‌హారాష్ట్ర‌, యూపీ కోవిడ్ ఆంక్ష‌ల‌ను స‌డలిస్తుండటంతో వార‌ణాసి నగరంలో కూడా కోవిడ్ నిబంధ‌న‌ల‌ను స‌డలించారు. దీన్ని చిన్న చిన్న వ్యాపారస్థులు వారి వ్యాపారాలను ప్రారంభించుకుంటున్నారు.ఇప్పటి వరకూ దుమ్ము పట్టిన వాటిని దులుపుకుని పనిలో పడ్డారు.దీంట్లో బాగంగా వారణాశిలోని  స్థానిక టీ షాపు ఓన‌ర్ 40 రోజుల త‌ర్వాత మ‌ళ్లీ షాపును తీసానని తిరిగి నా పనిలో పడ్డానని తెలిపాడు. ఇన్నాళ్లు ఉపాది మూత పడి నానా కష్టాలు పడ్డానని వాపోయాడు. మ‌హారాష్ట్ర‌లోని పూణెలో జిమ్‌లు, సెలూన్లు తెరుచుకున్నాయి.