లాక్‌డౌన్‌ కొవిడ్ మరణాలను నివారించింది.. కానీ పరోక్షంగా జీవితాలను కోల్పోవచ్చు: కొత్త స్టడీ

  • Published By: srihari ,Published On : June 4, 2020 / 01:09 PM IST
లాక్‌డౌన్‌ కొవిడ్ మరణాలను నివారించింది.. కానీ పరోక్షంగా జీవితాలను కోల్పోవచ్చు: కొత్త స్టడీ

భారతదేశంలో కరోనా వైరస్ (Covid-19) వ్యాప్తిని లాక్ డౌన్‌తో మరణాలను నివారించింది. కానీ.. పరోక్షంగా దేశ ప్రజలు జీవనోపాధిని కోల్పోవచ్చుని ఇద్దరు ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గత రెండు నెలల్లో అమలులో ఉన్న లాక్‌డౌన్ సమయంలో హింస, ఆకలి, రుణాలు, తీవ్ర ఒత్తిడిని పరిణామాలుగా గుర్తించినట్టుగా తెలిపారు. భారత లాక్ డౌన్‌పై మధ్యంతర రిపోర్టును The Working Paper పేరుతో అమెరికా నాన్ ప్రాఫిట్ రీసెర్చ్ ఏజెన్సీ నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ (NBER)కు సమర్పించింది. లాక్ డౌన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన జీవితాలు బయటకు కనిపించవని తెలిపింది. ఇప్పటివరకూ లాక్ డౌన్ అన్ని అంతర్జాతీయ ప్రమాణాలను చేరుకుంది. కానీ, రిలీఫ్ ప్యాకేజీ మాత్రం ఆశించిన స్థాయిలో లేదని తెలిపింది. 

భారత్‌లో మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. దశలవారీగా లాకౌడౌన్ మూడు నెలలు వరకు పొడిగిస్తూ వచ్చింది. దీని కారణంగా వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జీవనోపాధిని కోల్పోయారు. ఉపాధి లేక కాలినడకనే ఇంటిదారి పట్టారు. పట్టణాల్లో ఉపాధి కోల్పోవడంతో సొంత గ్రామాలకు వెళ్లేందుకు వలస కార్మికులు ప్రత్యేక రైళ్లలో తిరిగి తమ ఇళ్లకు చేరుకున్నారు. జూన్ 1 నుంచి భారతదేశంలో లాక్ డౌన్ ఆంక్షలను సడలించింది. లాక్ డౌన్ సమయంలో చాలామంది హింస, ఆకలి, రుణబాధలు, తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారు. 

ఇవన్నీ కనిపించేవి కావు. కొంతమంది ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకోవచ్చు. ఒక మహిళ గృహహింసకు గురై ప్రాణాలు కోల్పోవచ్చు. ఈ చావులు ఇప్పుడే కాదు.. రానున్న రోజుల్లో ఆకలి బాధలు, రుణబాధలు మరిన్ని పెరిగి దీర్ఘాకాలిక అనారోగ్యంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. సంక్షేమ ఉపశమన చర్యలు లేనప్పుడు.. భారతీయ జనాభా లాక్ డౌన్ గురయ్యే మూడు నిర్మాణ లక్షణాలను విశ్లేషకులు ఉదహరించారు. మొదటిది.. సాధారణం శ్రమ చేసేవారిలో మొత్తం భారతీయ నివాస గృహాలలో 20 శాతానికి పైగా ఉన్నారు.

అలాంటి వ్యక్తులకు బతుకు పోరు కష్టమే చెప్పవచ్చు.  రెండవది అనధికారిక ఉత్పత్తి  ప్రాముఖ్యత..  భారతదేశ జిడిపిలో సగానికి పైగా అనధికారిక రంగంలో ఉత్పత్తి అవుతుంది. ఆయా రంగాలను ఆన్‌లైన్‌లో కార్యకలాపాలు సాగించడం సాధ్యపడదు. ఇక.. మూడవది, మధ్యస్థ గృహాల పొదుపులు తక్కువగా ఉన్నాయి. వారంతా ఉద్యోగాలన్నీ కోల్పోతే 21 రోజుల లాక్‌డౌన్ ద్వారా మొత్తం గృహాలలో 38శాతం తీసుకోవడానికి ఆదాయం సరిపోదని విశ్లేషకులు చెబుతున్నారు. బుధవారం నాటికి భారతదేశంలో 216, 677 కేసులు నమోదయ్యాయి.