Lockdown: ఏపీలో లాక్‌డౌన్ నిజమేనా? ప్రభుత్వం క్లారిటీ!

Lockdown: ఏపీలో లాక్‌డౌన్ నిజమేనా? ప్రభుత్వం క్లారిటీ!

Lockdown

Lockdown in AP: సోమవారం నుంచి ఆంధ్రలో కర్ఫ్యూ. సమస్యాత్మక ప్రాంతాల్లో పూర్తిస్థాయి లాక్ డౌన్. పదో తరగతి పరీక్షలు రద్దు. స్కూల్స్ బంద్. పట్టణ ప్రాంతాల్లో పరిమిత వేళల్లో మాత్రమే షాపింగ్…. వాట్సాప్‌తో పాటు ఫేస్ బుక్, ట్విట్టర్‌లో ప్రస్తుతం సర్కులేట్ అవుతున్న మెసేజ్‌ ఇదే. దీంతో ప్రజలు మరోసారి భయాందోళనలకు గురవుతున్నారు. నిజమేనా అంటూ తెలిసిన వారికి ఫోన్లు చేసి ఆరాలు తీస్తున్నారు. కానీ ఈ మెసేజ్‌లో ఎలాంటి నిజం లేదంటున్నారు అధికారులు. ప్రస్తుతానికి ఏపీలో ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేసింది ప్రభుత్వం.

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మాత్రం ఆంక్షలు విధించింది ప్రభుత్వం. విజయవాడలో ఎగ్జిబిషన్‌కు అనుమతి రద్దు చేసింది. మే 1 వరకు అనుమతులు ఉన్నప్పటికీ… కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అటు గుంటూరు జిల్లాలో కూడా కరోనా ఆంక్షలు విధించారు అధికారులు. ఈ రోజు నుంచి పార్క్‌లు, స్విమ్మింగ్ పూల్స్, ఓపెన్ జిమ్‌లు పూర్తిగా మూసివేస్తున్నారు.