హైదరాబాద్ లో లాక్‌డౌన్ కఠినంగా అమలు..

  • Published By: srihari ,Published On : May 15, 2020 / 11:23 AM IST
హైదరాబాద్ లో లాక్‌డౌన్ కఠినంగా అమలు..

కరోనా, లాక్ డౌన్ పై సీఎం కేసీఆర్ (మే 15, 2020) హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లోపై ప్రధాన చర్చ జరుగుతోంది. గ్రేటర్ పరిధిలోని ముగ్గురు పోలీస్ కమిషనర్లు హాజరు అయ్యారు. కరోనా కట్టడికి అనుసంరించాల్సిన వ్యూహంపై అధికారులతో సమీక్షిస్తున్నారు. గ్రేటర్ లో కరోనా నియంత్రణ చర్యలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. హైదరాబాద్ లో కఠినంగా లాక్ డౌన్ అమలు చేసే అవకాశం ఉంది. 

గత వారం రోజులుగా నగరంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. వలస కూలీల్లో కూడా పాజిటివ్ కేసులు వస్తున్నా… వాటిలో కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పైనే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. నగరంలో కరోనా కట్టడికి మరింత పకడ్బంది చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వారం, పది రోజుల క్రితం తగ్గిన కేసులు ఆ తర్వాత పెరుగడం మొదలైంది. గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో కరోనా నివారణ చర్యలు, కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్ధేశం చేయనున్నారు. 
 
గ్రేటర్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. కొన్ని మరిన్ని కేసులు ఎక్కువ అవుతుండటంతో ఆ ప్రాంతాలను ప్రత్యేక కంటైన్ మెంట్ జోన్లుగా గుర్తించి ఆ ప్రాంతంలో మరిన్ని కఠిన చర్యలు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ ప్రాంతంలోకి ఎవరిని అనుమతించకుండా, ఎవరిని బయటకు వెళ్లనివ్వకుండా కఠిన చర్యలు తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది.

Read Here>> రోజుకు 3 పరీక్షలు.. తెలంగాణలో డిగ్రీ ఎగ్జామ్స్ నిర్వహణకు కసరత్తు