Breaking News : తెలంగాణలోకి మిడతల దండు!

  • Published By: madhu ,Published On : May 28, 2020 / 04:57 AM IST
Breaking News : తెలంగాణలోకి మిడతల దండు!

మిడతల దండు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందా ? అంటే ఎస్ అంటున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలోకి ఎంట్రీ ఇచ్చిన మిడతల దండు…రెండుమూడు రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశించే ప్రమాదముంది. దీంతో కేసీఆర్‌ సర్కార్ అప్రమత్తమైంది. రాష్ట్ర సరిహద్దుల్లోని నిజామాబాద్‌, కామారెడ్డి, అసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌భూపాలపల్లి జిల్లాల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మహారాష్ట్ర ప్రభుత్వం నియంత్రించలేకపోతే సమస్య ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఈ సమస్యపై నిన్న ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి సరిహద్దు జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో నిఘాబృందాలు, గ్రా మ కమిటీలను ఏర్పాటుచేసి మిడతల దండుతో కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలన్నారు. 

ప్రస్తుతం 17 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఒక మిడతల గుంపు మహారాష్ట్రలోని అమరావతి సమీపంలోకి చేరుకుంది. మిడతల దండు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని వ్యవసాయ శాఖ కమిషనర్ బి. జనార్ధన్ రెడ్డి సూచించారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో నిఘా బృందాలు, గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి మిడత దండుతో కలిగే నష్టాలను వివరించాలని..అవగాహన కల్పించాలని సూచించారు. 

ప్రధానంగా ఈ మిడతల వల్ల పంటలపై అధిక ప్రభావం చూపనుంది. పచ్చని చేలు చూస్తుండగానే..మటుమయం అవుతాయి. లక్షలు, కోట్లలో వచ్చిపడుతున్న ఈ మిడతల వల్ల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పంటలను రక్షించుకొనే పనిలో పడ్డారు. ఆఫ్రికా ఖండంలో మొదలైన ఈ దండు..అరేబియా, పాకిస్తాన్ దాటి భారత్ ను కమ్మేసింది.

ఏప్రిల్ 11వ తేదీన పాక్ నుంచి భారత్ లోకి ప్రవేశించింది. రాజస్థాన్ రాష్ట్రంలోని సగం జిల్లాలకు విస్తరించాయి. అక్కడ వేల హెక్టార్లలో పంటలను నాశనం చేశాయి. ఈ దండును నియంత్రించేందుకు రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో వ్యవసాయ అధికారులు డ్రోన్లను వినియోగిస్తున్నారు. వీటి ద్వారా రసాయనం చల్లుతున్నారు. 

ఎడారి మిడత : – 
బరువు : 2 గ్రాములు
పొడవు : 2 – 3 అంగుళాలు.
జీవితకాలం : 3 – 6 నెలలు.
దండులో ఉండే సంఖ్య : 4 – 8 కోట్లు. 

Read:Hyderabadలో మరో ఫ్లై ఓవర్, అండర్ పాస్ బ్రిడ్జి ప్రారంభం