RJD-LJD : ఆర్జేడీలో ఎల్జేడీ విలీనం

బీజేపీని ఓడించేందుకు విపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని శరద్ యాదవ్ అన్నారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మాట్లాడుతూ ప్రస్తుతానికి సమైక్యత తమ ప్రాధాన్యత అన్నారు.

RJD-LJD : ఆర్జేడీలో ఎల్జేడీ విలీనం

Rjd Ljd

LJD merged RJD : దేశంలో రెండు రాజకీయ పార్టీలు విలీనమయ్యాయి. రాష్ట్రీయ జనతాదళ్ (RJD)లో లోక్తాంత్రిక్ జనతా దళ్ (LJD) విలీనం అయింది. కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్.. తన ఎల్‌జేడీ పార్టీని ఆదివారం డిల్లీలో ఆర్‌జేడీలో విలీనం చేశారు. శరద్ యాదవ్ శరద్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్‌లు విడిపోయిన 25 ఏళ్ల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా శరద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆర్జేడీలో ఎల్జేడీ పార్టీ విలీనం ప్రతిపక్షాల ఐక్యతకు తొలి అడుగు అని అన్నారు. బీజేపీని ఓడించేందుకు విపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. నేడు రాజకీయాల్లో యువత అవసరం ఉందన్నారు. విపక్షాల ఐక్యతకు తొలి అడుగుగా తమ పార్టీని ఆర్జేడీలో విలీనం చేసినట్టు శరద్ యాదవ్ చెప్పారు.

CM KCR : గులాబీ దళపతికి ఆర్జేడీ ప్రతిపాదన!

బీజేపీని ఓడించేందుకు విపక్షాలన్నీ ఏకం కావడం తప్పనిసరి అని ఆయన అన్నారు. ప్రస్తుతానికి ఏకీకరణ తమ ప్రాధాన్యత అని.. తర్వాత మాత్రమే ఐక్య ప్రతిపక్షానికి ఎవరు నాయకత్వం వహిస్తారనే దాని గురించి ఆలోచిస్తామని తెలిపారు.

అనంతరం ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మాట్లాడుతూ ప్రస్తుతానికి సమైక్యత తమ ప్రాధాన్యత అన్నారు. తదుపరి ఉమ్మడి ప్రతిపక్షానికి ఎవరు నాయకత్వం వహిస్తారనేది ఆలోచిస్తామని చెప్పారు. శరద్ యాదవ్ తీసుకున్న నిర్ణయం ప్రజల డిమాండ్ అన్నారు. ఇది సరైన సమయం ఇతర ప్రతిపక్షాలకు సందేశం ఇచ్చారని పేర్కొన్నారు.