పెంపుడు కుక్కల చోరీ..డిటెక్టివ్ లా మారి కనిపెట్టిన యజమాని

పెంపుడు కుక్కల చోరీ..డిటెక్టివ్ లా మారి కనిపెట్టిన యజమాని

londan man find his lost spaniels tracks : లండన్‌లో నివాసి టోని క్రోనిన్‌ అనే వ్యక్తి ప్రాణంగా పెంచుకునే స్వానియల్స్‌ జాతికి చెందిన ఏడు కుక్కలు సడెన్ గా మాయం అయ్యాయి. దీంతో తన కుక్క కోసం టోనీ వెతకటం మొదలు పెట్టారు. అచ్చం డిటెక్టివ్ లా మారి తన కుక్క కోసం వెతకటం ప్రారంభించారు. అలా వెతగ్గా వెతగ్గా ఓ చోట తన కుక్కలు కనిపించటంతో..అతని ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి.

టోనీని గుర్తు పట్టిన ఆ కుక్కలు పరుగెత్తుకుంటూ వచ్చి అతని కాళ్ల చుట్టూ తోక ఊపుకుంటూ తిరిగుతుంటే టోనికీ కన్నీళ్లు ఆగలేదు. వాటిని గుండెలకు హత్తుకున్నాడు..ఇక్కడ మరో విషయం ఏమిటంటే..టోని కుక్కతో పాటు అక్కడ మరో 70 కుక్కలు కనిపించటంతో షాక్ అయ్యాడు. అ కుక్కలన్నీ మేలు జాతికి చెందినవే కావటం గమనించాల్సిన విషయం…

లండన్‌లో నివాసం ఉంటున్న టోని క్రోనిన్‌..స్వానియల్స్‌ జాతికి చెందిన ఏడు కుక్కలను పెంచుకుంటున్నాడు. అవంటే అతనికి ప్రాణం. వాటితో ఆటలు ఆడేవాడు..ఎంజాయ్ చేసేవాడు. అవికూడా యజమానితో భలే ఆడుకునేవి.. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం అతడి పెంచుకునే కుక్కలను ఎవరో దొంగిలించారు. మొత్తం ఏడు కుక్కల్ని కూడా చోరి చేశారు. వీటిలో ఐదు కుక్క పిల్లలు కూడా ఉన్నాయి.

ఈ క్రమంలో కుక్కలను దొంగిలించిన వారి గురించి.. ఎంక్వయిరీ చేశాడు. అచ్చం డిటెక్టివ్ లాగా అవి ఎక్కడున్నాయో సమాచారాన్ని సేకరించాడు. వాటిని ఎక్కడ దాచారనే సమాచారం తెలిసింది. దీంతో క్షణం కూడా ఆగలేదు. అలా తన పెంపుడు కుక్కలను వెతుక్కుంటూ కార్మర్‌థైన్‌షైర్‌కు వెళ్లాడు. అక్కడ తన కుక్కలతో పాటు మరో 70 కుక్కలను కూడా ఉండటం చూసి షాకయ్యాడు టోనీ. వీటి విలువ లెక్కేస్తే..దాదాపు రూ.40 లక్షలకు పైనే ఉంటుందని అంచనా వేశాడు.

ఈ సందర్భంగా టోని మాట్లాడుతూ.. ‘‘నా పెంపుడు కుక్కలను వెతుకుతూ వెళ్లిన నాకు అక్కడ మరో 70 కుక్కలు కనిపించాయి. లాబ్రడార్స్, వెస్టీస్, పగ్స్‌ వంటి పలు రకాల జాతులకు చెందినవి ఉన్నాయి. వీటి మధ్యలో నా పెంపుడు కుక్కలు కూడా ఉన్నాయి. మమ్మల్ని చూడగానే అవి భయంతో అరిచాయి.

నా పెంపుడు కుక్కలు నన్ను గుర్తు పట్టి..నా దగ్గరకు పరిగెత్తుకు వచ్చాయని తెలిపారు. పాపం చోరీకి గురైన కుక్కలకు భయం పోలేదు. ఓ కుక్క నా దగ్గరకువచ్చి నా కాళ్ల మధ్య దూరిందని తెలిపాడు. కాగా లాక్ డౌన్ తరువాత కుక్కల చోరీలు పెరిగాయి. వాటిని దొంగిలించినవారు వాటిని అమ్మేసుకుంటున్నారు అని తెలిపాడు.

అదే విషయాన్ని పోలీసులకు సమాచారం అందించగా కుక్కలను దాచి పెట్టిన ప్రాంతానికి వచ్చిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.వాటిలో 22 కుక్కల యజమానులను గుర్తించి వారికి అప్పగించారు. మిగిలిన వాటిని సంరక్షిస్తున్నామని..వారి యజమానులు వచ్చి అడిగితే ఇచ్చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా లాక్ డౌన్ తరువాత కుక్కల ధరలు పెరిగాయని దీంతో కుక్కల చోరీలు పెరిగాయని పోలీసు సూపరింటెండెంట్ రాబిన్ మాసన్ తెలిపారు.