Woman Cat Marriage: ఇదేం విడ్డూరం: పిల్లిని పెళ్లి చేసుకున్న మహిళ

పెంపుడు పిల్లిని విడిచి ఉండలేని ఓ మహిళ ఏకంగా ఆ పిల్లినే పెళ్లి చేసుకుంది. 'ఆ..! ఇదేం విడ్డూరం. పిల్లిని పెళ్లి చేసుకుందా' అంటూ అవాక్కవుతున్నారా. ఆ పిల్లి పెళ్లి గోలేంటో చూద్దాం

Woman Cat Marriage: ఇదేం విడ్డూరం: పిల్లిని పెళ్లి చేసుకున్న మహిళ

Debora

Woman Cat Marriage: ప్రపంచంలో రోజు ఏదో ఒక వింత చోటుచేసుకుంటూనే ఉంది. సోషల్ మీడియా పుణ్యమా అని కొన్ని సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. పెంపుడు పిల్లిని విడిచి ఉండలేని ఓ మహిళ ఏకంగా ఆ పిల్లినే పెళ్లి చేసుకుంది. ‘ఆ..! ఇదేం విడ్డూరం. పిల్లిని పెళ్లి చేసుకుందా’ అంటూ అవాక్కవుతున్నారా. ఆ పిల్లి పెళ్లి గోలేంటో చూద్దాం. లండన్ నగరానికి చెందిన 46 ఏళ్ల డెబోరా హోడ్జ్ అనే మహిళకు పెంపుడు జంతువులంటే ఎంతో ఇష్టం. తనకంటే ఎక్కువగా తన పెంపుడు జంతువులను ప్రేమిస్తానని.. డెబోరా చెప్పిందంటే..జంతువులంటే ఎంత ఇష్టమో అర్ధం చేసుకోవాలి. అయితే సొంత ఇల్లు లేని డెబోరాకు అద్దె ఇంట్లో జంతువులను పెంచుకోవడం కష్టంగా మారింది. అద్దె ఇళ్లల్లో యజమానులు ‘పెంపుడు జంతువులను అనుమతించం’ అంటూ డెబోరాకు షరతులు విధించేవారు. దీంతో మూడుసార్లు ఎంతో ఇష్టంగా పెంచుకున్న కుక్కలు, పిల్లులను వదిలేసింది డెబోరా. అయితే ఐదేళ్ల క్రితం ఒక పిల్లిని తెచ్చుకున్న డెబోరా..ఆ పిల్లిపై ఎంతో ఇష్టం పెంచుకుంది. క్షణం కూడా పిల్లిని వదిలి ఉండలేనంతగా ప్రేమను పెంచుకుంది. అయితే ఈ పిల్లిని కూడా బయటకు పంపించివేయాలంటూ అద్దె ఇంటి యజమాని డెబోరాకు సూచించాడు.

Also read:Bihar : గాలి వానకు కూలిపోయిన నిర్మాణంలో ఉన్న వంతెన

దీంతో ఒక ఉపాయం ఆలోచించిన డెబోరా..అద్దె సమయంలో కుదుర్చుకున్న నియమనిబంధనలను ఒకసారి పరిశీలించింది. డెబోరా జీవిత భాగస్వామిగా ఉండే ఎవరైనా అద్దె ఇంటిలో ఉండొచ్చు అన్న నిబంధనను హైలైట్ చేసిన డెబోరా..బాగా ఆలోచించి ఒక అనూహ్య నిర్ణయం తీసుకుంది. తాను ఎంతో ప్రేమగా చూసుకునే పిల్లిని తన జీవిత భాగస్వామిగా చేసుకోవాలని నిశ్చయించుకుంది డెబోరా. అనుకున్నదే తడువుగా పెళ్లి ఏర్పాట్లు చేసుకుంది. పెళ్లి అంటే తూతూ మంత్రం పెళ్లి కాదు. తన జీవిత భాగస్వామి పిల్లికి మంచి సూట్ తొడిగి, తాను కూడా మెరిసే కొత్త బట్టలు కట్టుకుని, బంధువులు, స్నేహితుల సమక్షంలో ఎంతో ఆడంబరంగా క్రిస్టియన్ సాంప్రదాయంలో పెళ్లి చేసుకుంది డెబోరా. పెళ్లి సందర్భంగా డెబోరాను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అంటూ ప్రీస్ట్ అడిగిన ప్రశ్నకు ‘మ్యావ్’ అంటూ పిల్లి సమాధానం కూడా ఇచ్చిందంటూ ఈ కథనం ప్రచురించిన స్థానిక మీడియా పత్రికలూ పేర్కొన్నాయి.

Also read:Temple in Railway station: రైల్వే స్టేషన్లో ఆలయం: తొలగిస్తే ప్రాణత్యాగానికి సిద్ధమన్న హిందూ సంఘాల ప్రతినిధులు

ఇక పెళ్లి అనంతరం తామిద్దరిని ఎవ్వరూ వేరు చేయలేరంటూ డెబోరా ఎంతో ఆనందం వ్యక్తం చేసింది. ‘జీవితాంతం తామిద్దరం కలిసే ఉంటాం,..ఏ ఇంటి యజమాని పిల్లిని తిరస్కరించినా నేను కూడా బయటకు వెళ్లి పోతా. అవసరమైతే రోడ్లమీదైనా నివసిస్తా’ అంటూ డెబోరా చెప్పిందని స్థానిక మీడియా పేర్కొంది. ఇది ఈ పిల్లి పెళ్లిలొల్లి. ఇంతకు ఆ పిల్లి పేరు ఏంటో తెలుసా “ఇండియా”. తాను ఇండియా(పిల్లి) ఇక ఒక్కటైపోయామని తామిద్దరిని ఆ దేవుడు కూడా విడదీయలేదంటూ డెబోరా చెప్పుకొచ్చింది. కాగా, డెబోరా హోడ్జ్ కు ఇదివరకే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారి సమక్షంలోనే ఇండియాను పెళ్లి చేసుకుంది డెబోరా.

Also read:HIndi Language : హిందీ మాట్లాడని వారు భారతదేశం వదిలి వెళ్లిపోవాలి : బీజేపీ మంత్రి వ్యాఖ్యలు