COVID: క‌రోనా సోకిన చిన్నారుల్లో 2 నెల‌ల పాటు ఈ ల‌క్ష‌ణాలు: ప‌రిశోధ‌కులు

0-3 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు ఉన్న‌ చిన్నారుల్లో మూడ్ మార‌డం, శ‌రీరంపై ద‌ద్దుర్లు రావ‌డం, క‌డుపునొప్పి వంటి ల‌క్ష‌ణాల‌ను గుర్తించిన‌ట్లు పరిశోధకులు చెప్పారు. 4-11 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు ఉన్న చిన్నారుల్లోనూ ఆయా ల‌క్ష‌ణాల‌తో పాటు ఏకాగ్ర‌త లోపించ‌డం కూడా క‌న‌పడింద‌ని తెలిపారు.

COVID: క‌రోనా సోకిన చిన్నారుల్లో 2 నెల‌ల పాటు ఈ ల‌క్ష‌ణాలు: ప‌రిశోధ‌కులు

COVID 19

COVID: క‌రోనా సోకి దాని తీవ్రత అధికంగా ఉన్న చిన్నారుల్లో ఆ వైర‌స్ సంబంధిత అనారోగ్య‌ ల‌క్ష‌ణాలు దాదాపు రెండు నెల‌ల పాటు ఉంటున్నాయ‌ని ప‌రిశోధ‌కులు గుర్తించారు. వారి ప‌రిశోధ‌న ఫ‌లితాల‌ను ది లాన్సెట్ చైల్డ్, అడల్‌సెంట్ హెల్త్ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించారు. క‌రోనా సోక‌క‌ముందు వరకు ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లూ లేని డెన్మార్క్‌లోని 14 ఏళ్లలోపు చిన్నారులపై ఈ పరిశోధనలు చేశారు. కరోనా సోకిన అనంతరం వారి నుంచి శాంపిళ్ళ‌ను సేక‌రించారు. పాఠ‌శాల‌ల‌కు వెళ్ళ‌కుండా, సాధార‌ణ పిల్ల‌ల్లా చ‌లాకీగా ఉండ‌లేక‌.. చాలా కాలం క‌రోనాతో బాధ‌ప‌డిన చిన్నారులు, శిశువుల్లో ఉండే ల‌క్ష‌ణాల‌ను గుర్తించేందుకు ఈ ప‌రిశోధ‌న చేశామని డెన్మార్క్‌ శాస్త్ర‌వేత్త‌లు అన్నారు.

JEE Main 2022: నేటి నుంచి జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు  

చిన్నారుల విష‌యంలో కొవిడ్ తీవ్ర ప్ర‌తికూల ప్ర‌భావాలు చూపుతోంద‌ని తెలిపారు. ప‌రిశోధ‌న‌లో భాగంగా.. క‌రోనా సోకిన చిన్నారుల్లో క‌న‌ప‌డే 23 సాధార‌ణ ల‌క్ష‌ణాల‌ను గురించి వారి త‌ల్లిదండ్రుల‌ను అడిగి తెలుసుకున్నామ‌ని తెలిపారు. 0-3 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు ఉన్న‌ చిన్నారుల్లో మూడ్ మార‌డం, శ‌రీరంపై ద‌ద్దుర్లు రావ‌డం, క‌డుపునొప్పి వంటి ల‌క్ష‌ణాల‌ను గుర్తించిన‌ట్లు చెప్పారు. 4-11 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు ఉన్న చిన్నారుల్లోనూ ఆయా ల‌క్ష‌ణాల‌తో పాటు ఏకాగ్ర‌త లోపించ‌డం కూడా క‌న‌పడింద‌ని తెలిపారు. అలాగే, 12-14 ఏళ్ల మ‌ధ్య ఉన్న చిన్నారుల్లో అల‌స‌ట‌, మ‌తిమ‌రుపు, ఏకాగ్ర‌త వంటి ల‌క్ష‌ణాలు క‌న‌ప‌డ్డాయ‌ని చెప్పారు. క‌రోనా వ‌ల్ల పిల్ల‌ల‌పై ప‌డే దీర్ఘ‌కాలిక ప్ర‌తికూల ప్ర‌భావాల గురించి మ‌రిన్ని ప‌రిశోధ‌నలు చేయాల్సి ఉంద‌ని పేర్కొన్నారు.