Premium Phones : కొత్త ప్రీమియం ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఇదిగో మీ లిస్టు మీకోసమే.. నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

Premium Phones : టాప్-ఎండ్ ప్రీమియం ఫోన్‌ను కొనేందుకు ప్లాన్ చూస్తున్నారా? అయితే ఇదే సరైన అవకాశం.. ఆపిల్ ఐఫోన్ (Apple iPhone), శాంసంగ్ (Samsung), గూగుల్ ఫిక్సెల్ (Google Pixel), ఇలా మరెన్నో ప్రీమియం ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

Premium Phones : కొత్త ప్రీమియం ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఇదిగో మీ లిస్టు మీకోసమే.. నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

Looking to Buy A Premium Phone Here are options from Apple, Samsung and Google

Premium Phones : టాప్-ఎండ్ ప్రీమియం ఫోన్‌ను కొనేందుకు ప్లాన్ చూస్తున్నారా? అయితే ఇదే సరైన అవకాశం.. ఆపిల్ ఐఫోన్ (Apple iPhone), శాంసంగ్ (Samsung), గూగుల్ ఫిక్సెల్ (Google Pixel), ఇలా మరెన్నో ప్రీమియం ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. (Google Pixel 7 Pro) గూగుల్ ఫిక్సెల్ 7ప్రోలోని కెమెరా మాదిరిగానే Apple iPhone 14 Pro Max పర్ఫార్మెన్స్ అందిస్తోంది. Samsung Galaxy Z Fold 4/Flip 4 డివైజ్‌ కూడా ప్రత్యేకమైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చేసింది. ఈ నవంబర్‌లో ప్రీమియం ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే.. మీకోసం ప్రీమియం ఫోన్ జాబితాను అందిస్తున్నాం.. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంపిక చేసుకుని కొనుగోలు చేయవచ్చు.

Apple iPhone 14 Pro Max :
ఆపిల్ ఐఫోన్ 14 Pro Max కొత్త కలర్ ఆప్షన్లతో వస్తుంది. స్పేస్ బ్లాక్, సిల్వర్, గోల్డ్, డీప్ పర్పుల్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ సిరామిక్ షీల్డ్ ఫ్రంట్, స్టెయిన్‌లెస్ స్టీల్ డిజైన్‌తో మాట్ గ్లాస్ బ్యాక్‌ను కలిగి ఉంది. 1TB స్టోరేజ్ వరకు అందిస్తుంది. డైనమిక్ ఐలాండ్, ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లేతో పాటు ఫీచర్లతో 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. 16-కోర్ న్యూరల్ ఇంజన్‌తో కూడిన Apple A16 బయోనిక్ చిప్ డివైజ్ పవర్ అందిస్తుంది. హ్యాండ్‌సెట్ వెనుక 48MP ప్రైమరీ కెమెరాను రెండు 12MP సెన్సార్‌లతో తీసుకొచ్చింది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 12MP TrueDepth కెమెరా ఉంది. iPhone 14 Pro Max IP68 రేటింగ్‌తో వచ్చింది. గరిష్టంగా 6 మీటర్ల లోతు వరకు 30 నిమిషాల వరకు నీటిలో వేసిన ఎలాంటి సమస్య ఉండదు. దీని ధర మార్కెట్లో రూ. 1,39,900 నుంచి అందుబాటులో ఉంది.

Looking to Buy A Premium Phone Here are options from Apple, Samsung and Google

Looking to Buy A Premium Phone Here are options from Apple

Samsung Galaxy Z Fold 4 :
శాంసంగ్ గెలాక్సీ Z Fold 4 ధర రూ. 1,54,999 ధరను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 7.6-అంగుళాల Full డైనమిక్ AMOLED ప్రధాన డిస్‌ప్లేతో పాటు 6.2-అంగుళాల సబ్-డిస్‌ప్లేతో ఫోల్డబుల్ డిజైన్‌ను కలిగి ఉంది. S పెన్ సపోర్ట్‌తో వచ్చింది. గ్రేగ్రీన్, ఫాంటమ్ బ్లాక్, బీజ్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. ఈ డివైజ్ 12GB RAMని ప్యాక్ అందిస్తుంది. 16 గంటల వరకు ఇంటర్నెట్ వినియోగాన్ని అందించగలదు. Galaxy Z Fold 4లోని కెమెరా సెన్సార్‌లు వెనుకవైపు 50 MP + 12 MP + 10 MP ఉన్నాయి.

Google Pixel 7 Pro :
గూగుల్ పిక్సెల్ 7 Pro భారత మార్కెట్లో రూ. 84,999 ధరతో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ Google Tensor G2 చిప్‌సెట్‌తో వస్తుంది. పిక్సెల్ 7Pro 5G-రెడీగా ఉంది. 3120 x 1440 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల క్వాడ్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంది. సెటప్‌లో 48MP, 12MP సెన్సార్‌లతో వచ్చిన 50MP ప్రధాన సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ హ్యాండ్‌సెట్ సెల్ఫీల కోసం 10.8MP కెమెరాతో వస్తుంది. పిక్సెల్ 7 ప్రో ఆండ్రాయిడ్ 13 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతుంది. 4,926mAh బ్యాటరీని కలిగి ఉంది.

Looking to Buy A Premium Phone Here are options from Apple, Samsung and Google

Looking to Buy A Premium Phone Here are options from Apple, Samsung and Google

Apple iPhone 14 :
ఆపిల్ ఐఫోన్ 14 2532×1170 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేతో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ A15 బయోనిక్ చిప్‌సెట్‌తో ఆధారితమైనది. మిడ్‌నైట్, పర్పుల్, స్టార్‌లైట్, ప్రొడక్ట్ RED బ్లూ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. అంతేకాదు.. 128GB, 256GB, 512GB స్టోరేజ్‌లో వస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో వెనుకవైపు 12MP ప్రధాన సెన్సార్ ఉంది. మరొక 12MP అల్ట్రా వైడ్ సెన్సార్‌తో వచ్చింది. సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్‌లో 12MP TrueDepth కెమెరా ఉంది. రూ. 79,900 ప్రారంభ ధరతో వస్తుంది.

Samsung Galaxy S22 Ultra :
శాంసంగ్ గెలాక్సీ S22 అల్ట్రా ప్రారంభ ధర రూ.1,09,999తో వచ్చింది. బుర్గుండి, ఫాంటమ్ బ్లాక్, ఫాంటమ్ వైట్, గ్రీన్ కలర్ వేరియంట్‌లలో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.8-అంగుళాల డైనమిక్ AMOLED 2x డిస్‌ప్లేను కలిగి ఉంది. S పెన్ సపోర్ట్‌తో వస్తుంది. 10MP, 12MP, 10MP సెన్సార్‌లతో వెనుక భాగంలో 108MP ప్రైమరీ కెమెరాతో వచ్చింది. ఈ డివైజ్ 5,000mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. గరిష్టంగా 40 గంటల టాక్ టైమ్‌ను ఆఫర్ చేస్తుందని పేర్కొంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Oppo A17K : ఒప్పో A17K స్మార్ట్‌ఫోన్ ధర తగ్గిందోచ్.. ఫీచర్లు అదుర్స్.. ఇప్పుడే కొనేసుకోండి.. డోంట్ మిస్..!