Hanuman birthplace : ఆంజనేయుడి జన్మస్థలం వివాదానికి మరింత ఆజ్యం పోసిన కర్ణాటక సీఎం

 హనుమంతుడి జన్మస్థానంపై వివాదం తారాస్థాయిలో కొనసాగుతున్న క్రమంలో కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై దీనికి మరింత ఆజ్యం పోసారు. ఆంజనేయుడు అక్కడ పుట్టాడు, ఇక్కడ పుట్టాడు అంటూ చాలా మంది.. చాలా చెపుతున్నారని... కానీ ఆంజనేయుడు కొప్పాల్ జిల్లా కిష్కింధ ప్రాంతంలోని అంజనాద్రి కొండల్లోనే పుట్టారని... ఇందులో ఎటువంటి సందేహం లేదని అన్నారు.

Hanuman birthplace : ఆంజనేయుడి జన్మస్థలం వివాదానికి మరింత ఆజ్యం పోసిన కర్ణాటక సీఎం

Anjanadri Hills is Lord Hanuman’s birthplace say CM Bommai : హనుమంతుడి జన్మస్థానంపై వివాదం తారాస్థాయిలో కొనసాగుతున్న క్రమంలో కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై దీనికి మరింత ఆజ్యం పోసారు. ఆంజనేయుడు అక్కడ పుట్టాడు, ఇక్కడ పుట్టాడు అంటూ చాలా మంది.. చాలా చెపుతున్నారని… కానీ ఆంజనేయుడు కొప్పాల్ జిల్లా కిష్కింధ ప్రాంతంలోని అంజనాద్రి కొండల్లోనే పుట్టారని… ఇందులో ఎటువంటి సందేహం లేదని అన్నారు.

కాగా తిరుమల కొండల్లోని అంజనాద్రి హనుమంతుడు పుట్టిన స్థలమని టీటీడీ చెపుతోంది. తమ రాష్ట్రంలోని కిష్కింధ (ప్రస్తుత హంపి ప్రాంతం) ఆంజనేయుడి జన్మస్థలమని కర్ణాటక వాదిస్తోంది. మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో ఉన్న అంజనేరిలో హనుమంతుడు జన్మించాడని మరికొందరు అంటున్నారు. ఇలా ఆంజనేయుడు జన్మస్థలంపై పలు వివాదాలు నడుస్తుండంగా ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసారు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ చేస్తున్న వాదనలను సీఎం బొమ్మై తోసిపుచ్చారు.

కాగా..హనుమంతుడు ఎక్కడ పుట్టాడు? ఈ ఒక్క ప్రశ్నకు.. భారతదేశంలో చాలా ప్రాంతాలు సమాధానాలవుతున్నాయి. మహారాష్ట్రలో అని ఒకరు.. కర్ణాటకలో అని కొందరు.. గుజరాత్‌లో అని మరొకరు.. హర్యానాలో అని మరికొందరు.. జార్ఖండ్‌లో అని ఇంకొకరు చెబుతున్నారు. అలాగే  మన తిరుమల గిరుల్లోనే ఆ పవనసుతుడు జన్మించాడనే కొత్త చర్చ కూడా కొనసాగుతోంది. తిరుమలలోని జాపాలి తీర్థమే.. ఆంజనేయుడి జన్మస్థలి  అంటూ టీటీడీ వాదిస్తోంది. తిరుమల గిరుల్లోనే.. ఆంజనేయుడు జన్మించాడని.. ఈ ప్రాంతాన్ని టీటీడీ నిర్లక్ష్యం చేస్తోందని భక్తులు, కొందరు చరిత్రకారుల నుంచి విమర్శలు వస్తున్నాయి. దీంతో.. రామభక్తుడు హనుమంతుడు.. ఎక్కడ జన్మించాడో తేల్చాలని టీటీడీ ఆదేశించింది. ఈ మేరకు.. పురాణాలు, ఇతర గ్రంథాలను పరిశోధించాలని.. టీటీడీ ఈవో జవహార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో.. ఆంజనేయుడి జన్మస్థలిపై అంతటా ఆసక్తి పెరిగింది.

తిరుమలలో జాపాలి తీర్థం ఎంతో ప్రసిద్ధి పొందింది. ఈ ప్రాంతమే హనుమంతుడి జన్మస్థలంగా నమ్ముతున్నారు కొందరు. ఇదే విషయమై.. శ్రీ హనుమ జన్మస్థలం-అంజనాద్రి పేరిట డాక్టర్ ఏవీఎస్ జీ హనుమత్ ప్రసాద్ ఓ గ్రంథాన్ని రచించారు. హనుమ చరిత్రకు శ్రీపరాశర సంహిత అనే గ్రంథం ప్రామాణికమైందని.. స్కంధ పురాణంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించినట్లుగా తన పుస్తకంలో తెలిపారు. వానర వీరుడు, వాయుదేవుని సుతుడు, పరమ రామభక్తుడు.. హనుమంతుడు పుట్టిన స్థలంపై వివాదం ఈనాటిది కాదు.

మారుతి జన్మస్థలిగా.. దేశంలో చాలా ప్రదేశాలు.. పుణ్యక్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. అంజనీదేవి.. బాల ఆంజనేయుడికి జన్మనిచ్చిన స్థలంగా చెబుతూ.. వివిధ ఆలయాల్లో నిత్యం పూజలందుకుంటున్నాడు హనుమంతుడు. అలా.. ఆంధ్రప్రదేశ్‌లోని పవిత్ర తిరుమల క్షేత్రంలోని జాపాలి తీర్థం కూడా ఒకటి. పవనసుతుడు ఇక్కడే జన్మించినట్లు కొన్ని పురాణాలు చెబుతున్నాయి.

Also read : Hanuman Birth place: హనుమంతుడి జన్మస్థలం వివాదంలో తెరపైకి మరో కొత్త అంశం