అల్లు అర్జున్ కారవాన్‌ను ఢీ కొట్టిన లారీ..

అల్లు అర్జున్ కారవాన్‌ను ఢీ కొట్టిన లారీ..

Allu Arjun Caravan: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’.. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఖ‌మ్మంలోని మోతు గూడెం అటవీప్రాంతంలో జరుగుతోంది.

Allu Arjun

ఈ సినిమా షూటింగులో పాల్గొని హైదరాబాద్ తిరిగి వస్తుండగా అల్లు అర్జున్ కారవాన్‌ ప్రమాదానికి గురైంది. ఖమ్మం రూరల్ సత్యనారాయణపురం వద్ద బన్నీ కారవాన్‌ను వేగంగా వస్తున్న లారీ వెనుక నుండి ఢీ కొట్టింది.

దీంతో కారవాన్‌ వెనుక భాగం దెబ్బతింది. వెంటనే బన్నీ మరో వాహనంలో హైదరాబాద్ పయనమయ్యారు. వెహికల్ మీద AA (అల్లు అర్జున్) పేరుతో కూడిన సింబల్ ఉండడంతో  హీరో కారవాన్‌‌లో ఉన్నారనుకుని స్థానికులు భారీగా గుమికూడారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆగస్టు 13న ‘పుష్ప’ మూవీ రిలీజ్ కానుంది.