Lose Weight : కొవ్వు కరిగి బరువు తగ్గేందుకు!

ప్రొటీన్ల కోసం చాల మంది మాంసాహారం తీసుకోవటాన్ని అలవాటు చేసుకుంటారు. అయితే మాంసాహారం వల్ల శరీరానికి ప్రొటీన్లు అందటం వాస్తవమే అయినప్పటికీ రెడ్ మీట్ వంటి వాటి వల్ల శరీరంలో కొవ్వుల మోతాదు అధికమౌతుంది.

Lose Weight : కొవ్వు కరిగి బరువు తగ్గేందుకు!

Fat And Lose Weight

Lose Weight : శరీరంలో అధికస్ధాయిలో కొవ్వులు, బరువు పెరగటం అన్నది ప్రస్తుతం పెద్ద సమస్యగా మారింది. వీటిని తగ్గించుకునేందుకు వివిధ రకాల మార్గాలను, ఆహారపు అలవాట్లను అనుసరిస్తుంటారు. ఆరోగ్యంగా బరువు తగ్గటానికి జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేయడం అవసరం. తద్వారా సులువుగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. అధిక బరువు,పొట్ట కొవ్వు ను తగ్గించుకోవాలనుకునే వారు కొన్ని చిట్కాలు పాటిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

ఉదయం నిద్రలేవగానే పరగడుపున ఒక లీటర్ గోరు వెచ్చని నీళ్లను సేవించాలి. లీటరు నీటిని ఒకేసారి తీసుకోకుండా కొద్ది కొద్దిగా తాగటం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది. కొవ్వులు వేగంగా కరుగుతాయి. అధిక బరువు తగ్గాలనుకునేవారు నెలరోజుల సమయంలో ఇలా ఉదయాన్నే గోరు వెచ్చని నీరు తాగటం వల్ల బరువు తగ్గే విషయంలో మార్పును గమనించవచ్చు.

ఉదయం అల్పాహారంగా చాలా మంది అయిల్ ఫుడ్స్ లాగించేస్తుంటారు. ఇలా చేయటం వల్ల బరువు తగ్గకపోను బరువు పెరుగుతారు. శరీరంలో కొవ్వులు మరింత రెట్టింపవుతాయి. దోశ , పూరీ, చపాతీ, గారె వంటి వాటికంటే పండ్లను తీనటం ఉత్తమం. సీజన్ వారీగా అందుబాటులో ఉండే పండ్లను అల్పాహారంగా తీసుకోవచ్చు. అలాకాకుంటే మొలకెత్తిన గింజలను కాని, ముందు రోజు రాత్రి నానబెట్టుకున్న నట్స్ కాని అల్పాహారంగా తీసుకోవాలి. మధ్యాహ్నం భోజనంలో తెల్లటి అన్నానికి బదులుగా బ్రౌన్ రైస్, చిరుధాన్యాలతో తయారైన ఆహారాలను తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల త్వరగా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. బ్రౌన్ రైస్, చిరుధాన్యాలు, పండ్లలో ఉండే ఫైబర్ శరీరంలోని కొవ్వులను కరిగించేందుకు దోహదం చేస్తుంది.

ప్రొటీన్ల కోసం చాల మంది మాంసాహారం తీసుకోవటాన్ని అలవాటు చేసుకుంటారు. అయితే మాంసాహారం వల్ల శరీరానికి ప్రొటీన్లు అందటం వాస్తవమే అయినప్పటికీ రెడ్ మీట్ వంటి వాటి వల్ల శరీరంలో కొవ్వుల మోతాదు అధికమౌతుంది. బరువు సైతం పెరగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రొటీన్ల కోసం మాంసాహారం కంటే ప్రొటీన్లు కలిగిన శాఖాహారాన్ని తీసుకోవటమే మంచిది. సోయాబీన్స్ వంటి వాటిని తీసుకోవటం వల్ల శరీరంలో మంచి కొవ్వులు పెరిగి చెడు కొవ్వులు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కాస్త తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. ఇది బరువు తగ్గించటంతోపాటు కొవ్వు కరిగేలా చేస్తుంది. వెల్లుల్లి రెబ్బలను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తేనెలో కలిపి తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల కొవ్వులను సులభంగా కరిగించుకోవచ్చు. బరువు తగ్గవచ్చు. యోగా, ధ్యానం, నడక వంటి వ్యాయామాలు రోజువారిగా చేయటం వల్ల బరువు తగ్గటంతోపాటు రాత్రి సమయంలో చక్కగా నిద్రపడుతుంది. నూనె పదార్ధాలతో తయారైన జంక్ ఫుడ్స్ తినటం మానేయాలి. బరువును, కొవ్వులను పెంచటంతోపాటు గుండె జబ్బుల ప్రమాదాన్ని జంక్ ఫుడ్స్ పెంచుతాయి. ఇలా చేస్తే తక్కువ కాలంలోనే బరువుతోపాటు శరీరంలో పెరుకున్న కొవ్వులను సులభంగా కరిగించుకోవచ్చు.