Lose Weight : వేసవిలో వ్యాయామం చేయకుండానే బరువు తగ్గొచ్చు!

బరువు తగ్గాలనుకునే వారు అయిల్ తో చేసిన వేపుళ్లకు దూరంగా ఉండాలి. వేసవి కాలంలో వీటిని తీసుకోకుండా ఉండటంమే ఆరోగ్యానికి మంచిది.

Lose Weight : వేసవిలో వ్యాయామం చేయకుండానే బరువు తగ్గొచ్చు!

Lose Weight Without Exercising

Lose Weight : జీవనశైలి, మారిన అలవాట్లు, చాలా మంది అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. బరువు తగ్గేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోతుంది. బరువు తగ్గాలని మరికొంత మంది అదే పనిగా వాకింగ్ వంటి రోజు వారి వ్యాయామాలు చేస్తున్నా వాటి ప్రభావం కొంతమేర మాత్రమే ఉంటుంది. ఈ నేపధ్యంలో ఆహారంలో చిన్నిపాటి మార్పులు చేయటం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చంటున్నారు నిపుణులు. అయితే వర్షకాలం, చలికాలాల్లో కంటే వేసవి కాలంలో బరువు ఈజీగా తగ్గొచ్చు. ఇందుకోసం పెద్దగా కష్టపడాల్సిన పనికూడా లేదు.

వేసవిలో కాలంలో శరీరంలో నీరు చెమట రూపంలో బయటకు పోతుంది. ఈ సందర్భంలో కోల్పోయిన నీటిని తిరిగి భర్తీ చేసుకోవాలన్న ఉద్దేశంతో చాలా మంది అధికమోతాదులో నీటిని సేవిస్తుంటారు. నీటిని ఎక్కవగా తీసుకోవటం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతోపాటు ఆహారాన్ని కూడా తక్కువ మోతాదులో తీసుకుంటాం. ఆహారమోతాదు తగ్గుతుంది కాబట్టి బరువు సులభంగా తగ్గవచ్చు. అయితే నీటిలో నిమ్మరసాన్ని చేర్చి తాగటం వల్ల నీరసం రాకుండా ఉంటుంది. ఇలా చేయటం వల్ల శక్తిని కోల్పోకుండా ఉంటారు. కొబ్బరి నీళ్లు తీసుకోవటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

వేసవి సీజన్లో దొరికే పండ్లు, కూరగాయలను తీసుకోవటం వల్ల బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. నీటి శాతం అధికంగా ఉండే పుచ్చకాయ ఖర్భుజా, కీర దోస వంటి వాటిని తీసుకోవాలి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు , ఫైబర్ బరువు తగ్గటంలో బాగా ఉపకరిస్తాయి. అదే సమయంలో సహజసిద్ధమైన పండ్ల రసాలను తీసుకోవటం మంచిది. కాఫీ,టీ, శీతలపానీయాలు, వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది.

బరువు తగ్గాలనుకునే వారు అయిల్ తో చేసిన వేపుళ్లకు దూరంగా ఉండాలి. వేసవి కాలంలో వీటిని తీసుకోకుండా ఉండటంమే ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే జీర్ణం అయ్యేందుకు ఎక్కవ సమయం తీసుకోవటం తోపాటు శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకునేలా చేసి బరువు పెరిగేందుకు వేపుళ్లు కారణమౌతాయి. సూప్ లు, సలాడ్ లు వంటి వాటిని తీసుకోవటం వల్ల జీర్ణ వ్యవస్ధ సాఫీగా ఉంటుంది. ఆహారాన్ని కొద్ది కొద్ది మొత్తాల్లో ఎక్కువ సార్లు తీసుకోవటం మంచిది. విటమిన్ డి, ప్రొటీన్స్, కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఇలా కొన్ని ఆహార నియమాలు పాటించటం ద్వారా వేసవి కాలంలో బరువును సులభంగా తగ్గవచ్చు.