‘లవ్ స్టోరి’లో లవ్లీగా సాయిపల్లవి..

సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేసిన ‘లవ్ స్టోరి’ మూవీ టీం..

  • Published By: sekhar ,Published On : May 9, 2020 / 07:40 AM IST
‘లవ్ స్టోరి’లో లవ్లీగా సాయిపల్లవి..

సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేసిన ‘లవ్ స్టోరి’ మూవీ టీం..

ఈ తరం కథానాయికల్లో ప్ర‌త్యేక‌మైన ఇమేజ్‌ని సొంతం చేసుకున్న హీరోయిన్.. సాయిప‌ల్ల‌వి.. త‌న అంద‌మైన న‌ట‌న‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. భానుమ‌తిగా ‘ఫిదా’తో ప‌రిచ‌యం అయిన సాయి ప‌ల్ల‌వి త‌ను పోషించే పాత్రలతో ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటూ కెరియ‌ర్‌ని లీడ్ చేస్తుంది. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో మ‌రోసారి మ్యాజిక్ చేసేందుకు ‘ల‌వ్ స్టోరి’తో సిద్ధమవుతుంది. నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి కాంబినేష‌న్ క్రేజ్ ల‌వ్ స్టోరీ పై అంచ‌నాల‌ను మ‌రింత పెంచింది. ఇప్పటికే విడుద‌లైన ఫస్ట్ లుక్, ‘‘ఏయ్ పిల్లా’’ సాంగ్‌‌కు విశేష‌మైన స్పంద‌న ల‌భించింది. ‘ల‌వ్ స్టోరి’కి ఇంకా 15 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. లాక్‌‌డౌన్ త‌ర్వాత అప్ప‌టి పరిస్థితుల్ని బేరీజు వేసుకొని షూటింగ్ ప్లాన్ చేస్తుంది యూనిట్.(ప్రభాస్ 20 పూజ పిక్స్ వైరల్..)

 శేఖ‌ర్ క‌మ్ముల సినిమాల‌లో క‌థానాయిక‌లు ఎంత హుందాగా ఉంటారో అంద‌రికీ తెలిసిందే.. భావోద్వేగాల‌తో నిండుకున్న ప్రేమ‌క‌థ‌ల‌తో సెల్యులాయిడ్‌పై శేఖ‌ర్ చేసే మ్యాజిక్‌ని మ‌రోసారి రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. బ‌ర్త్ డే సంద‌ర్భంగా టీం విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌లో సాయి ప‌ల్ల‌వి మ‌రింత అందంగా క‌నిపించింది. వర్షంలో ఆడుతున్న స్టిల్‌కు సోష‌ల్ మీడియాలో అద్భుత‌మైన స్పంద‌న ల‌భిస్తుంది.

Love Story
‘లవ్ స్టోరి’ సినిమాను ఏమిగోస్  క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.
హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంట గా నటిస్తున్న ఈ మూవీలో రాజీవ్ కనకాల,ఈశ్వరీ రావు, దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
సహ నిర్మాత :భాస్కర్ కటకంశెట్టి
సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్
ఆర్ట్: రాజీవన్ 
పి.ఆర్.వో -జి.ఎస్.కె మీడియా
మ్యూజిక్ : పవన్ సి.హెచ్
నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్, పి.రామ్మోహన్ రావు
రచన- దర్శకత్వం : శేఖర్ కమ్ముల.