Vijay Meri Hai : హిందీలో అదరగొడుతున్న ఆది సినిమా.. ‘విజ‌య్ మేరీ హై’..

ఆది సాయికుమార్‌, శాన్వీ హీరో హీరోయిన్లుగా బి. జ‌య ద‌ర్శక‌త్వంలో రూపొందిన చిత్రం‘ల‌వ్‌లీ’.. ల‌వ్ అండ్‌ మ్యూజిక‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రాన్నిఆర్‌జే సినిమాస్ బ్యానర్‌పై బి.ఎ.రాజు నిర్మించారు..

Vijay Meri Hai : హిందీలో అదరగొడుతున్న ఆది సినిమా.. ‘విజ‌య్ మేరీ హై’..

Lovely Movie Hindi Dubbed Version Vijay Meri Hai Crosses 50 Million Views

Vijay Meri Hai : ఆది సాయికుమార్‌, శాన్వీ హీరో హీరోయిన్లుగా బి. జ‌య ద‌ర్శక‌త్వంలో రూపొందిన చిత్రం‘ల‌వ్‌లీ’.. ల‌వ్ అండ్‌ మ్యూజిక‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రాన్నిఆర్‌జే సినిమాస్ బ్యానర్‌పై బి.ఎ.రాజు నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం అద్భుత‌మైన విజ‌యం సాధించ‌డంతో పాటు న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ అంద‌రి కెరీర్‌లో ఒక మొమ‌ర‌బుల్ మూవీగా నిలిచింది.

Lovely

టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్ రూబెన్స్ సంగీతమందించిన ఈ మూవీలోని అన్ని పాట‌లు ఇప్ప‌టికీ మంచి ప్ర‌జాద‌ర‌ణ పొందుతున్నాయి. ఈ మూవీ హిందీ డ‌బ్బింగ్ వెర్ష‌న్ ‘విజ‌య్ మేరీహై’ కి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. తాజాగా ‘విజ‌య్ మేరీ హై’ సినిమా 50 మిలియ‌న్ల‌కి పైగా వ్యూస్ సాధించింది.

Lovely

ఈ సంద‌ర్భంగా.. హీరో ఆదిసాయికుమార్ మాట్లాడుతూ.. ‘‘ప్రేమ‌కావాలి’ త‌ర్వాత నా కెరీర్‌లో మ‌రో మొమ‌ర‌బుల్ మూవీ ‘ల‌వ్‌లీ’.. క‌మ‌ర్షియ‌ల్‌గా కూడా బిగ్ స‌క్సెస్ సాధించింది. ద‌ర్శ‌కురాలు జ‌య‌ గారు అద్భుత‌మైన క‌థా-క‌థ‌నంతో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని అల‌రించేలా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ల‌వ్‌, ఫ్యామిలీ ఎమోష‌న్స్, డైలాగ్స్ ఇలా అన్నిచ‌క్క‌గా కుదిరాయి. న‌టుడిగా న‌న్ను మ‌రో లెవ‌ల్‌కి తీసుకెళ్లిన సినిమా ‘ల‌వ్‌లీ’.. అనూప్‌గారు ఎవ‌ర్‌గ్రీన్ ఆల్బ‌మ్ ఇచ్చారు. ఇప్ప‌టికీ ఆ పాట‌ల‌ను ఎంజాయ్‌ చేస్తుంటాను. బి.ఎ. రాజు గారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్‌కాకుండా అత్య‌ద్భుతంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ల‌వ్‌, ఫ్యామిలీ ఎమోష‌న్స్ అన్నింటిని బ్యాలెన్స్ చేస్తూ తీసిన ‘ల‌వ్‌లీ’ హీందీ వెర్ష‌న్ ‘విజ‌య్ మేరీ హై’ 50 మిలియ‌న్ల మార్క్‌ను చేరుకోవ‌డం చాలా హ్యాపీగా ఉంది’’.. అన్నారు..

Lovely

నిర్మాత బి.ఎ.రాజు, హీరోయిన్ శాన్వీ, సంగీత ద‌ర్శ‌కుడు అనూప్ రూబెన్స్‌ మాట్లాడుతూ.. ఈ చిత్రం హిందీలో 50 మిలియ‌న్ల మార్క్ క్రాస్ చేయ‌డం హ్యాపీగా ఉంది. ఈ సినిమాను హిందీలో డ‌బ్ చేసి యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన ఆదిత్య మ్యూజిక్ వారికి విజ‌యాభినంద‌న‌లు తెలిపారు..

Lovely