Weather Alert: అల్పపీడన ప్రభావం.. భారీ వర్షాలకు అవకాశం!

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ మరో సూచన చేసింది. ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోస్పియర్‌ స్థాయి కొనసాగుతోందని, దీని ప్రభావంతో శుక్రవారం ఉత్తర బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో రెండుమూడు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Weather Alert: అల్పపీడన ప్రభావం.. భారీ వర్షాలకు అవకాశం!

Rains

Weather Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ మరో సూచన చేసింది. ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోస్పియర్‌ స్థాయి కొనసాగుతోందని, దీని ప్రభావంతో శుక్రవారం ఉత్తర బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో రెండుమూడు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

ఇక ఇది వచ్చే 24 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి క్రమంగా పశ్చిమ, వాయవ్య దిశగా కదులుతూ ఒడిశా మీదుగా పయనిస్తుందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో పాటు నైరుతి రుతుపవనాలు గురువారం నాటికి రాష్ట్రమంతటా విస్తరించాయని వెల్లడించిన అధికారులు.. రుతుపవనాలు, అల్పపీడన ప్రభావంతో ఈ నెల 14 వరకు ఉత్తర కోస్తాంధ్ర, యానాం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో పలుచోట్ల శుక్ర, శనివారాలలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించగా కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ వాతావరణ అధికారులు తెలిపారు. మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఇప్పటికే గురువారం రెండు తెలుగు రాష్టాలలో పలుచోట్ల వర్షాలు కురిశాయి.