Dairy Products : డెయిరీ ఉత్పత్తులతో గుండెకు ముప్పు తక్కువే…

అత్య‌ధికంగా డెయిరీ కొవ్వులు తీసుకున్న వారిలో గుండె జ‌బ్బుల ముప్పు త‌క్కువ‌గా ఉన్న‌ట్టు తాము గుర్తించామ‌ని జార్జ్ ఇనిస్టిట్యూట్ ఫ‌ర్ గ్లోబ‌ల్ హెల్త్‌కు చెందిన డాక్ట‌ర్ మాటి మ‌ర్ల్కుంద్ తెలిపారు. పాల ఉత్పత్తులు

Dairy Products : డెయిరీ ఉత్పత్తులతో గుండెకు ముప్పు తక్కువే…

Dairy Products

Dairy Products : పాలు, పాల ఆధారిత పదార్థాలు అంటేనే చాలా మందికి చిరాకు వాటిని తీసుకునేందుకు అస్సలు ఇష్టపడరు హృద్యోగ సమస్యలకు దారీతీసే కొవ్వులు, కొలెస్ట్రాల్లు పాల ఉత్పత్తుల్లో అధికంగా ఉంటాయని అధిక శాతం మంది బావిస్తుంటారు. కానీ వాస్తవం దీనికి పూర్తిగా భిన్నమని పలు పరిశోధనల ద్వారా తెలుస్తుంది. పాలు, డెయిరీ ఉత్ప‌త్తులు అధికంగా తీసుకునే వారిలో వాటిని త‌క్కువ‌గా తీసుకునే వారితో పోలిస్తే గుండె జ‌బ్బుల ముప్పు త‌క్కువ‌గా ఉంటుంద‌ని తాజా అధ్య‌య‌నం వెల్ల‌డించింది.

డెయిరీ ఫ్యాట్ అధికంగా తీసుకునే వారిలో అంద‌రూ భావించేల మర‌ణాల ముప్పు ఎక్కువ‌గా లేక‌పోవ‌డమే కాకుండా వీటిని తీసుకోవ‌డం ద్వారా గుండె జ‌బ్బుల బారినప‌డే అవ‌కాశం తక్కువ‌ని పీఎల్ఓఎస్ మెడిసిన్ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురిత‌మైన ప‌రిశోధ‌న వివ‌రించింది.4000 మందికి పైగా స్వీడ‌న్ పౌరుల‌పై నిర్వ‌హించిన అధ్య‌య‌నంతో పాటు వివిధ దేశాల్లో జ‌రిగిన 17 ప‌రిశోధ‌న‌ల‌ను విశ్లేషించిన తరువాత శాస్త్ర‌వేత్త‌లు అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా డెయిరీ వినియోగం పెరిగిన నేప‌ధ్యంలో దీనిపై మెరుగైన అవ‌గాహ‌న అవ‌స‌ర‌మ‌ని ప‌రిశోధ‌కులు పేర్కొన్నారు.

అత్య‌ధికంగా డెయిరీ కొవ్వులు తీసుకున్న వారిలో గుండె జ‌బ్బుల ముప్పు త‌క్కువ‌గా ఉన్న‌ట్టు తాము గుర్తించామ‌ని జార్జ్ ఇనిస్టిట్యూట్ ఫ‌ర్ గ్లోబ‌ల్ హెల్త్‌కు చెందిన డాక్ట‌ర్ మాటి మ‌ర్ల్కుంద్ తెలిపారు. పాల ఉత్పత్తులు గుండెను రక్షించడంతోపాటు గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా కాపాడతాయని ధ్రువీకరించారు. డెయిరీ కొవ్వులు, డెయిరీ ఉత్ప‌త్తులు ఆరోగ్యం మీద ఎలాంటి ప్ర‌భావం చూపుతాయ‌నే దానిపై మ‌రిన్ని ప‌రిశోధ‌న‌లు అవ‌స‌ర‌మ‌ని శాస్త్రవేత్తలు అభిప్రాయానికి వచ్చారు.

డెయిరీ ఉత్ప‌త్తులు అధికంగా తీసుకునే వారిలో గుండె జ‌బ్బుల‌తో పాటు ఇత‌ర‌త్రా ఏ కార‌ణాల‌తో అయినా మ‌ర‌ణాల ముప్పు త‌క్కువ‌గా ఉన్న‌ట్టు తేలిందట. పన్నీర్, పెరుగు, పాలకోవ, మజ్జిగ, వంటి డైరీ ఉత్పత్తులను తీసుకోవటం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయని పరిశోధకులు గుర్తించారు. ఇవి శరీరంలోని జీవక్రియలకు ఎంతగానో దోహదం చేస్తున్నట్లు కనుగొన్నారు. సంపూర్ణ సమతుల్య ఆహారాల్లో పాలు చాలా ముఖ్యమైనవి నిర్ధారించారు. డైరీ ఉత్పత్తుల్లో కాల్షియం, విటమిన్ బి, ప్రొటీన్లు, మాగ్నిషియం, పొటాషియం, ప్రొబయోటిక్స్, రైబోఫెవిన్, విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి ఉండటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.