Lucifer Telugu Remake: మెగాస్టార్‌కు నో చెప్పిన బాలీవుడ్ దర్శకుడు!

మలయాళంలో సూపర్ హిట్ అయిన ఓ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు చిరు. మలయాళంలో రెండేళ్ల క్రితం వచ్చిన 'లూసిఫర్' అక్కడ సంచలన విజయాన్ని నమోదు చేసింది. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ అక్కడ మంచి విజయం సాధించి ఆయన కెరీర్‌లోని ఓ చెప్పుకోదగ్గ చిత్రంగా నిలిచింది.

Lucifer Telugu Remake: మెగాస్టార్‌కు నో చెప్పిన బాలీవుడ్ దర్శకుడు!

Lucifer Telugu Remake Bollywood Director Says No To Megastar

Lucifer Telugu Remake: మలయాళంలో సూపర్ హిట్ అయిన ఓ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు చిరు. మలయాళంలో రెండేళ్ల క్రితం వచ్చిన ‘లూసిఫర్’ అక్కడ సంచలన విజయాన్ని నమోదు చేసింది. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ అక్కడ మంచి విజయం సాధించి ఆయన కెరీర్‌లోని ఓ చెప్పుకోదగ్గ చిత్రంగా నిలిచింది. దాంతో ఈ సినిమాను చిరంజీవి తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ రీమేక్ లో దర్శకుడు జయం మోహ‌న్ రాజా ఇక్కడ నెటీవిటికి తగ్గట్లు తగినన్ని మార్పులు చేసినట్లు తెలుస్తుంది.

ఇప్పటికే ఈ రీమేక్‌కి బైరెడ్డి అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుండగా ఈ నెల మొదటి వారంలో మొదలుకావాల్సన రెగ్యులర్ షూటింగ్ మరోసారి వాయిదా పడింది. తెలుగు రాష్ట్రాలలో కరోనా విజృంభణతో పాటు ఇండస్ట్రీలో కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో యూనిట్ షూటింగ్ మొదలుపెట్టనేలేదు. ఎలాగో షూటింగ్ కోసం సమయం ఉండగా ఈలోగా మిగతా క్యాస్టింగ్ పూర్తిచేయాలని భావించిన దర్శక, నిర్మాతలు ఇందులో పవర్ ఫుల్ విలన్ పాత్ర కోసం వేట మొదలుపెట్టారట.

ముందుగా చిరంజీవిని ఢీకొనే ప్రతినాయకుడి పాత్ర కోసం బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే.. మెగాస్టార్‌తో నటించే అవాకాశాన్ని అనురాగ్‌ నిరాకరించినట్లు వినికిడి. సహజంగా దర్శకుడైన అనురాగ్ అప్పుడప్పుడు పాత్ర నచ్చితే సినిమాల్లో కూడా నటిస్తుంటారు. బాలీవుడ్ తో పాటు తమిళంలో కూడా అనురాగ్ ముఖ్య పాత్రలలో సినిమాలొచ్చాయి. ఆయా సినిమాలో అనురాగ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ క్రమంలోనే లూసిఫర్ కోసం అనురాగ్ ను తీసురావాలని అనుకున్నారు. కానీ ఆయన నో చెప్పడంతో ఇప్పుడు ప్రతినాయకుడి కోసం మళ్ళీ వేట కొనసాగుతుందట.

Read: Live Parasitic in Pen: పెన్నులో పురుగు.. కొనేందుకు విపరీతమైన డిమాండ్!