lunar eclipse: రేపే చంద్ర గ్రహణం.. మన దేశంలో ఉందా? Lunar Eclipse 2022: Will it be visible in India

lunar eclipse: రేపే చంద్ర గ్రహణం.. మన దేశంలో ఉందా?

ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఈనెల 15, 16 తేదీల్లో ఏర్పడనుంది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7.02 గంటల నుంచి గ్రహణం మొదలవుతుంది.

lunar eclipse: రేపే చంద్ర గ్రహణం.. మన దేశంలో ఉందా?

lunar eclipse: ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఈనెల 15, 16 తేదీల్లో ఏర్పడనుంది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7.02 గంటల నుంచి గ్రహణం మొదలవుతుంది. ఉదయం 7.57 గంటల నుంచి భూమి నీడ చంద్రుడి మీద పడటం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12.20 గంటలకు గ్రహణం ముగుస్తుంది. అయితే, మన దేశంలో ఈ గ్రహణం కనిపించదు. మన దేశం ఉత్తరార్థ గోళంలో ఉంది. గ్రహణం దక్షిణార్థ గోళంలోని ప్రాంతాల్లోనే కనిపిస్తుంది. ఆ లెక్కన మనకు గ్రహణ ప్రభావం ఉండదు. చంద్రగ్రహణం పౌర్ణమి రోజున ఏర్పడుతుంది.

 

సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు, భూమి నీడ చంద్రుడి మీద పడుతుంది. ఈ నీడ పూర్తిగా చంద్రుడిని కప్పేయడం వల్ల ఏర్పడేదే సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ సారి చంద్రగ్రహణం సందర్భంగా భూమి నీడ చంద్రుడిని 99.1 శాతం కప్పేయబోతుంది. భూమి వ్యాసం చంద్రుడికన్నా 4 రెట్లు అధికంగా ఉంటుంది. అందువల్ల దాని నీడ చంద్రుడి మీద చాలా సేపు ఉండేందుకు అవకాశం ఉంటుంది. దీంతో సంపూర్ణ చంద్రగ్రహణం దాదాపు 104 నిమిషాల వరకు సాగే అవకాశం ఉంటుంది.
బ్లడ్ మూన్ అంటే
సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని బ్లడ్ మూన్ అని కూడా అంటారు. చంద్ర గ్రహణం ఏర్పడినప్పుడు వివిధ దేశాల్లో చంద్రుడు ఎరుపు, ముదురు నారింజ రంగులో కనిపిస్తాడు. అందువల్లే చంద్రగ్రహణాన్ని బ్లడ్ మూడ్ అంటారు.

×