Two Crores Donation: ముఖ్యమంత్రి సహాయనిధికి లైకా రూ.2కోట్ల విరాళం

కరోనా కష్టకాలంలో కోలీవుడ్ ఇండస్ట్రీ తమిళనాడు రాష్ట్రానికి అండగా నిలబడుతోంది. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు రాష్ట్రానికి కరోనాకు సంబంధించిన సపోర్ట్ చేస్తుండగా.. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా లైకా ప్రొడక్షన్స్ కూడా తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 2కోట్ల రూపాయలను విరాళంగా అందించింది.

Two Crores Donation: ముఖ్యమంత్రి సహాయనిధికి లైకా రూ.2కోట్ల విరాళం

Lyca Productions

Lyca Productions Donates: కరోనా కష్టకాలంలో కోలీవుడ్ ఇండస్ట్రీ తమిళనాడు రాష్ట్రానికి అండగా నిలబడుతోంది. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు రాష్ట్రానికి కరోనాకు సంబంధించిన సపోర్ట్ చేస్తుండగా.. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా లైకా ప్రొడక్షన్స్ కూడా తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 2కోట్ల రూపాయలను విరాళంగా అందించింది.

కరోనా సెకండ్‌ వేవ్ కారణంగా ప్రజలను ఆదుకునేందుకు ముందుకొచ్చిన లైకా ప్రొడక్షన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత అల్లిరాజా సుభాస్కరన్ తరపున సంస్థ ప్రతినిధులు రెండు కోట్ల రూపాయల చెక్‌ను ముఖ్యమంత్రి స్టాలిన్‌కు అందజేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను సచివాలయంలో కలిసి రూ. 2కోట్ల చెక్‌ని అందచేశారు లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధులు జీకేఎం తమిళ్ కుమరన్, నిరుతన్, గౌరవ్.

ఇప్పటికే సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 50లక్షలు తన వంతుగా సాయం చేయగా.. రూ.25 లక్షల విరాళం అందజేశారు తమిళ స్టార్ హీరో అజిత్. సూర్య,కార్తి కూడా రూ.కోటి విరాళం అందించారు. దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ కూడా రూ. 25 లక్షల విరాళం అందజేశారు. రజీనీకాంత్ కూతురు సౌందర్య రజినీకాంత్ తన భర్త విశాగణ్‌తో కలిసి రూ. కోటి విరాళం అందజేసారు.