MAA President Naresh: కృష్ణుడిలా నరేష్ వ్యూహం.. విష్ణు గెలుపు ఖాయమేనా?

'మా' అధ్యక్షుడు సీనియర్ నటుడు నరేష్.. తాను సపోర్ట్ చేసిన మంచు విష్ణు కచ్చింగా గెలుస్తారనే ధీమాను వ్యక్తం చేశారు.

MAA President Naresh: కృష్ణుడిలా నరేష్ వ్యూహం.. విష్ణు గెలుపు ఖాయమేనా?

Naresh (1)

MAA President Naresh: మా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు సీనియర్ నటుడు నరేష్.. తాను సపోర్ట్ చేసిన మంచు విష్ణు కచ్చింగా గెలుస్తారనే ధీమాను వ్యక్తం చేశారు. 80 నుంచి 100 ఓట్ల మెజార్టీతో మంచు విష్ణు విజయం సాధిస్తాడని అన్నారు.

ఓట్ల లెక్కింపునకు ముందు మాట్లాడిన నరేష్.. ‘‘‘మా’ మసకబారిందని ఆరోపించడాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకుని పనిచేశానన్నారు. ఈ ఎన్నికల్లో వూహ్యం ప్రకారం పట్టుదలతో విష్ణు గెలుపే లక్ష్యంగా పనిచేసినట్లు చెప్పారు. కృష్ణుడిలా వ్యూహం అమలు చేయటంలో నా రాజకీయ అనుభవం పనికొచ్చిందన్నారు. నేను కృష్ణుడి పాత్ర పోషించానని అందరూ చెప్పుకుంటున్నారు. కృష్ణుడు అందరి వాడే కదా? మా వాళ్లు గెలిస్తే, కృష్ణుడి వ్యూహం ఫలించినట్లేనని అన్నారు.

పది మంది వ్యక్తులు, వాళ్ల వెనకాల ఓ ముఠా నాయకుడు కలిసి ‘మా’ను పక్కదోవ పట్టించడానికి ప్రయత్నించారని, నాగబాబు వ్యాఖ్యలు నన్ను బాధించాయని అన్నారు. కోట శ్రీనివాసరావు లాంటి మహానటుడిని తిట్టడం సరైనది కాదన్నారు. చాలామంది ఓటు వేయడానికి వచ్చారని, 80-100 ఓట్ల ఆధిక్యంతో విష్ణు విజయం సాధిస్తాడని అన్నారు. బెంగళూరు చెన్నై నుంచి వచ్చిన దాదాపు 30-40ఓట్లు విష్ణు విజయంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.